-
-
కాలం తెరలు
Kalam Teralu
Author: Kosuri Ravikumar
Publisher: Self Published on Kinige
Pages: 48Language: Telugu
Description
రవి బహుప్రతిభావంతుడు. ఇంతకుముందు ప్రచురించిన 'బొడ్డుపేగు' వచన కవితా సంపుటితో తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ సంపుటిలో సామాజిక స్పృహకు కవితాత్మతకు తార్కాణంగా ఎన్నో నానీలున్నాయి.
- ఆచార్య ఎన్. గోపి
* * *
రవికుమార్ నానీల్లో గాఢ అనుభూతి ప్రధానగుణం. బలమైన వ్యక్తీకరణతో కాలం తెరల్ని కవితా ముక్తకాలుగా పాఠకుల హృదయాల్లో నాటుతున్న ఈ యువకవి కలం భవిష్యత్ వాగ్దానంలా కన్పిస్తున్నది.
- డా. సి. భవానీదేవి
* * *
ఈ పుస్తకంలోని కొన్ని నానీలు:
వేసవి
ఒకపెద్ద పొయ్యి
చెరువును ఇగిర్చి
రాళ్లు మిగిల్చింది
మట్టిగడ్డ
సిగ్గుపడిందేవిటో
ఈ చక్కిలిగింత
తొలిచినుకుదే
పెళ్ళికి ముందు
తాంబూలాలు శుభలేఖ
ఇప్పుడు
వీసా, పాస్‌పోర్ట్‌లు
Preview download free pdf of this Telugu book is available at Kalam Teralu
Login to add a comment
Subscribe to latest comments
