-
-
కాలం దాచిన కన్నీరు
Kalam Dachina Kanneeru
Author: Gollapudi Maruthi Rao
Pages: 106Language: Telugu
దురదృష్టంలో కృంగిపోయే జీవితాల్లో హాఠాత్తుగా అదృష్టాన్ని కల్పించడం ఎంత కష్టమో, అదృష్టంతో పొంగిపోయే జీవితాల్ని దురదృష్టం వేపు మళ్ళించడమూ అంతే కష్టం. మంచికి కానీ, చెడుకి కాని - వ్యక్తిగాని, కుటుంబంకానీ, వ్యవస్థగానీ ఒక పద్దతిలో గమనిస్తూంటుంది. ఆ గమనం సృష్టి అంత విచిత్రమూ, స్రష్ట అంత అనంతమూను. ఆంధ్రదేశంలో అతి సామాన్య మధ్య తరగతి కుటుంబంలోని ‘అయిదు’ మనస్సుల ‘నాలుగు’ రోజుల ఇతివృత్తం ఈ నవల. ఆశ, ప్రేమ, కోరిక, అభిమానం, అనురాగం, సుఖం, దుఃఖం అనే ఉత్ప్రేక్షలతో ఉక్కిరిబిక్కిరయిన అయిదు మనస్సులవి. ఆ మనస్సుల పేర్లు – హనుమంతయ్య, వరలక్ష్మి, గాయత్రి, వెంకటరావు, సుందరి - వాటి కథ ఈ ‘కాలం దాచిన కన్నీరు’.
50 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ నవల కొద్దికాలం క్రితం కౌముది అంతర్జాల పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు కినిగెలో ఈ-బుక్‌గా తీసుకురావడానికి సహకరించిన కౌముది సంపాదకులకు కృతజ్ఞతలు.
