• Kalalato Prayanam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలలతో ప్రయాణం

    Kalalato Prayanam

    Author:

    Pages: 165
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అతడు ఎదురుచూడమన్నాడు


జలపాత్రంలో తడిసి

కొండలు స్నానం చేస్తున్నాయి


సెలయేళ్లు గలగలలు మీటి

మంద్రంగా అలలు మోగుతున్నాయి


బండల మీద మొగ్గలు దొర్లి

అత్తరుగిన్నెలు వొలుకుతున్నాయి


చెట్లమీంచి గుంపులుగా లేచి

పక్షులు తోరణాలు కడుతున్నాయి


వేగుచుక్కా వెన్నెలా కలిసి

నేలమీద ముగ్గులేస్తున్నాయి


సరిగ్గా ఈలాటి వేళలోనే

అతడు ఎదురుచూడమన్నాడు


భరోసా ఇచ్చేవాళ్లెప్పుడూ

బాధ్యతలు స్వీకరిస్తాడు


ఆకాశం రంగులు చల్లే బాటలో

అతడు వేచి వుండమన్నాడు


మనుషుల్ని ప్రేమించేవాళ్లు

మాటమీదే వుంటారు


అతడు వేచి వుండమని చెప్పాడు
నమ్మకంగా ఎదురుచూడమన్నాడు
మళ్లీ మళ్లీ తప్పకుండా
మందిలోకి తిరిగి వస్తానన్నాడు

Preview download free pdf of this Telugu book is available at Kalalato Prayanam