Description
తన ఆశకత్తకు సిగ్గుపడి తలవంచుకున్నాడు నిశీధుడు. ముఖం ఎర్రబడింది. తన పక్కనే నలుగురు కోయ వీరులు గుస గుస లాడుకోవటం గమనించాడు. “మహా వీరుడు కాలనాగుకు బాణం వదలటమే చేతకాదు” అంటున్నారని తలచి మరింత తడబడిపోయాడు.
సామాన్యమైన మహిషాలనే చంపలేని తను, తెల్లదున్నను ఏం చంపగలడు? అది అసంభవం! యీ నలుగురూ తన ఆశక్తతను గూడెంలో చెప్పక మానరు. అది అందరికి తెలియకపోదు. ఇక కాలకన్య తనకేం దక్కుతుంది ?
గుండెలను ఆక్రమించుకుంటున్న నిరాశా నిస్పృహా తరంగాలకు లోనై శ్వేతాశ్వాన్ని మడమలతో గట్టిగా నొక్కాడు. అంతవరకూ అతని చేతిలో అటువంటి బాధ అనుభవించలేదా చిన్నారి గుర్రం. తన అసమ్మతి తెలియ చేస్తున్నట్లు గట్టిగా సకలించి ముందుకు దూకింది. సరాసరి పోయి తెల్లదున్న ముందు ఆగింది.
Preview download free pdf of this Telugu book is available at Kalakanya
I don't think this is written by MadhuBabu. He has a style in narration and it lacks in this novel.
His narration is not like "story telling".
We get involved into the story.
This novel is like Chandamama story :-(
can you kindly upload kaala naagu novel pls