• Kalachakra Tantram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాలచక్ర తంత్రం

    Kalachakra Tantram

    Pages: 89
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

కాలచక్రం అంటే, ఈ సమస్త చరాచర సృష్టికీ సాక్షీభూతంగా నిలిచిన కాలమే...! జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోతున్న సృష్టి పరిణామ చక్రమే 'కాలచక్రం' అంటే!! టిబెట్‌కి చెందిన బౌద్ధులు ఈ కాలచక్రాన్ని ఒక తంత్రంగా- ఒక తాత్త్విక సిద్ధాంతంగా, ఒక జీవన విధానంగా ఆచరిస్తారు.

చక్రభ్రమణం అంటే, చక్రంలా గుండ్రంగా తిరగం. అంతరిక్షంలో గ్రహాల దగ్గర నుంచి, విడవకుండా ఊపిరి పీల్చి వదిలే మానవ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వరకూ సమస్తమైన సృష్టి కదలికలన్నీ ఈ కాలచక్రం పరిధిలోకే వస్తాయి. కాలచక్రాన్ని సాధించుకోవడం అంటే, ఈ సృష్టి యొక్క స్థితిలయాల్ని సాధించుకోవడంగా అర్ధం చేసుకోవాలి. కాలచక్రాన్ని సాధించుకోవడం అంటే, ఈ సృష్టిలో స్థూలంగా కన్పించే అంశాలే కాదు, సూక్ష్మమైన శక్తుల్ని కూడా సాధించుకొని, జ్ఞానాన్ని (లేక) బుద్ధత్వాన్ని పొందడం అన్నమాట!!

కాలానికి లోబడకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకని, కాలదేవత లేదా కాలపురుషుడు ఆధీనంలో ఈ సృష్టి నడుస్తోందని కాలచక్ర సిద్ధాంత కర్తలు భావిస్తారు. చక్రానికి మొదలు, చివర అనేవి వుండవు. ''ఆద్యంతాలు లేని స్థితి''ని చక్రం అంటారు. ఈ కాలానికి మొదలు ఎప్పుడో, చివర ఎప్పుడో నిర్ణయించడం సాధ్యం కాదు- అందుకని దీన్ని కాలచక్రం అన్నారు. దీనికి అధిష్టానదేవత కాలపురుషుడు!

కాలాన్ని మహిమాన్విత శక్తిగా మలిచే "కాలచక్ర తంత్రం" గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. 2006 జనవరిలో జరిగిన కాలచక్ర తంత్ర ప్రావేశిక మహోత్సవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన తెలుగు గ్రంథం ఇది.

- డా॥ జి. వి. పూర్ణచందు

Preview download free pdf of this Telugu book is available at Kalachakra Tantram