-
-
కాకీక కాకికి కాక
Kakika Kakiki Kaka
Author: Palaparthy Indrani
Publisher: Vanguri Foundation of America
Pages: 88Language: Telugu
ఇంద్రాణి రచనలు అనగానే 'హమ్మయ్య, అసలైన అనుభూతి కవిత్వం చదువుకోవచ్చును' అని అనుకోకుండానే అనుకునే ఆమె ప్రపంచవ్యాప్త అసంఖ్యాక అభిమానులని ఈ పుస్తకం భలే బోల్తా కొట్టిస్తుంది. ఆ మాట ఒక్కటే చెప్పి ఆపేస్తాను. లేకపోతే సస్పెన్స్ పోతుంది. పుస్తకం లోపలికి వెళ్లి చదవడం మొదలుపెట్టాక, మీరూ నాలాంటివారే అయితే ఓ గంటా గంటన్నరలో ఆఖరి పేజీ తిప్పేశాక కానీ ఆ మత్తులోంచి, గమ్మత్తులోంచి బయటపడరు. పడ్డాక ఈ 'కాకీక కాకికి కాక..’ మనకి కూడా 'కాకే' అనిపిస్తుంది. అంతేకాదు. మనకి తెలిసిన ఇంద్రాణి వేరు, ఈ ఇంద్రాణి వేరు అని కూడా అనుమానం వేస్తుంది. అంతేకాదు, ఈ మధ్య మా అమెరికాలో జరుగుతున్న ఒక చర్చకి సమాధానం కూడా దొరకవచ్చును. ఆ చర్చ ఏమిటంటే.. అసలు ఏ రచనని అయినా 'ఇది కథ', 'ఇది వ్యాసం' అని నిర్వచించడం అవసరమా? అలా నిర్వచించడం వలన ఆ రచనని ఒక మూసలో పోసి, కొన్ని ప్రమాణాలు నిర్దేశించి, వాటి పరిధిలోనే చూడడం సమంజసమా? ఇంద్రాణి అలాంటి పరిధులకి, ప్రక్రియలకి అతీతంగా తను చెప్పదల్చుకున్నది చెప్పదలచుకున్న పద్దతిలో, మధ్యే మధ్యే కవిత్వం జోడించి అందించిన ఈ 'కాకీక కాకికి కాక..’ ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ఆదరణ పొందుతుంది అని మా నమ్మకం.
- వంగూరి చిట్టెన్ రాజు
