-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కాకతీయ నాయకులు (free)
Kakatiya Nayakulu - free
Author: Dr. Jakkampudi Sitaramarao
Pages: 180Language: Telugu
శ్రీ యన్.జి. రంగాగారి భక్తుడను నేను. ఈ అనువాదము చేయుటకు భక్తిభావమొక్కటే ప్రేరణ కాదు. వారి “కాకతీయ నాయకులు" ఆంగ్ల గ్రంథ రచన "ప్రభు వెక్కిన పల్లకి కాదోయ్. అది మోసిన బోయీలెవ్వరు" అన్నవతుగా సాగినది. చారిత్రకాంశముల ప్రాధాన్యంతో పాటు సామాజిక స్పృహ పరీమళించినది. ప్రపంచ విముక్తి పోరాటములతో పూజ్య రంగాజీగారి అనుబంధము. అవగాహన, భాగస్వామ్యము ఈ గ్రంథమున ప్రతి ఫలించినవి. ప్రతాపరుద్రుడు. ప్రోలయ, కాపయ, వినాయక దేవుల నాలంబనము చేసుకొని, పూజ్య రంగాజీ గ్రామస్వామ్యము, స్వపరిపాలన, చేతి వృత్తుల వారి స్వతంత్ర జీవనము, రైతాంగపు ప్రాథమిక హక్కులు, పంచాయితీ వ్యవస్థ అధికారములను, వేయేల తన జీవిత ఆశయమగు “రైతుకూలీ శ్రేయోరాజ్యము" సాధనకై తాను పడిన తపనను పఠితల హృదయములలో సూటిగా నాటుకొనునట్లు రచించినారు.
పూజ్య రంగాజి ఆంగ్లము సరళము. సుబోధకము. వాక్య నిర్మాణము సుదీర్ఘము. వారీ గ్రంథమున కట్టలు తెంచుకొని ఉరుకు తమ భావావేశమును పలుచోట్ల నిబ్బరించుకొనినారు. ఆయాపట్టుల వారి శైలి శివజటాజూట వినిర్గత గాంగఝరీ సదృశముగా ఉన్నది. ఆంగ్ల భాషయందు తెనుగు నుడికారపు సొంపులను మిగుల హృద్యముగా పొందుపరచినారు. అది వీరి రచనా శిల్పపు విలక్షణత, విశిష్టత.
- పబ్లిషర్స్
good website