-
-
ఖలిల్ జిబ్రాన్ - ఇసుక నురగ
Kahlil Gibran Isuka Nuraga
Author: Y. Mukunda Rama Rao
Publisher: Self Published on Kinige
Pages: 63Language: Telugu
జేబులో పెట్టుకుని ఒకేమారు చదివేయ గలిగే చిన్న చిన్న పుస్తకాలు రాయాలనుకున్నారు ఖలిల్ జిబ్రాన్. 1918-1926 కీ మధ్య అలా నాలుగు పుస్తకాలు రాయగలిగారు, అదీ ఆంగ్లంలో మొదటిసారిగా. ఆ నాలుగు పుస్తకాలు ఇవి. : The Madman పిచ్చివాడు (1918) ; The Forerunner పురోసూచన (1920); Sand and Foam ఇసుక నురగ (1926) ఇంకా The Prophet ప్రవక్త (1923). మొదటి మూడు నీతిబోధలు, సూత్రాలు, నాలుగవది కొంత ఆత్మకథతో సాగిన 26 కవిత్వ వ్యాసాలు. 1918 తరువాత నుండే ఆంగ్లంలో రాయడం మొదలెట్టారు, అంతకుముందంతా వీరి రచనలు అరబ్బీలో ఉండేవి. ఆంగ్లంలో వచ్చిన ఇతర రచనలివి. : Spirits Rebellious, (1908), The Broken Wings (1912), A Tear and a Smile (1914), Jesus the Son of Man (1928), The Earth Gods (1929), The Wanderer (1932). వీటిల్లోవి కొన్ని అరబ్బీ నుండి అనువాదం చేయబడ్డవి. తన సొంత మార్మిక చిత్రాల అలంకరణతో ఈ ఇసుక నురగ సంకలనం మొదట ప్రచురించబడింది.. ఇందులోనివి నిజానికి కొన్ని ఆలోచనలు, కొన్ని బోధనలు, కొన్ని సుభాషితాలు, కొన్ని అనుభవాలు, కొన్ని కవిత్వ చిత్రాలు, అన్నీ కలగలిసిన అద్భుతమైన రచన ఇది. ప్రపంచంలో అనేక భాషల్లోకి అనువాదమయింది. కాలానికి ప్రాంతానికి మతానికి వర్గానికి తట్టుకుని నిలబడగలిగింది. వయస్సుతో నిమిత్తం లేనిది. లెక్కలేనన్ని ఇటువంటి ఆలోచనలు బహుశా ఇసుక నురగ లాంటివని, ఈ సంకలనానికి ఈ పేరు పెట్టారేమో!
