• Kadupu Kotha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కడుపుకోత

    Kadupu Kotha

    Publisher: Chinuku Prachurana

    Pages: 100
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 32 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఓదెల వెంకటేశ్వర్లు వ్రాసిన ''కడుపుకోత'' పుస్తకం లోని కథలన్నీ సామాజికగతిని చిత్రిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదంలో భాగమైన వెంకటేశ్వర్లు కథలు తెలంగాణ పల్లెలోలని సమస్యలను తీపిజ్ఞాపకాలను, విధ్వంసాలను ప్రజల జీవితంలోని ఎన్నో కోణాలను చిత్రిస్తున్నాయి.

వెంకటేశ్వర్లు కథల్లో భాష నుడికారం పల్లెటూరి వాతావరణాన్ని పోషిస్తున్నాయి. కథను వ్రాసేటప్పుడు వస్తువు, పాత్రలు, సన్నివేశాలు సంభాషణలు ఎంత ముఖ్యమో వాటిని నిర్వహించే శిల్పం ఎంత ప్రధానమో భాష నుడికారాలు, కథనం కూడా అంతే ముఖ్యం. శిల్పంలో అంతే ప్రధానం. కథ సామాన్యుని జీవితాలను రికార్డు చేసే ప్రక్రియ. ఆ ప్రక్రియను సజీవం చేసేయి భాష నుడికారాలు. కథలను రక్తి కట్టిస్తాయి. చదివిస్తాయి.

తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంవాదం పరివేశనంలో చూసినప్పుడు ఆ భావజాలాన్ని చిత్రించే ప్రతినిధి కథల సంపుటుల్లో ''కడుపుకోత'' ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కథలు తెలంగాణ ''తెలుగు కథ''లో తెలుగు సాహిత్య కథా సాహిత్యంలో తప్పక స్థానాన్ని సంపాదించుకుంటాయి. వెంకటేశ్వర్లును ఒక బాధ్యతగల రచయితగా నిలబెడ్తాయి.

జీవిత సంఘర్షణలను చిత్రించిన వెంకటేశ్వర్లు స్వరం తెలుగు కథకు ఒక కొత్త కోణాన్ని చేకూరుస్తున్నది. ఇంత సంవేదనాత్మకమైన కథలను వ్రాసిన వెంకటేశ్వర్లును అభినందిస్తున్నాను. ఇంకా కథలు ఇంకా గొప్పగా వ్రాస్తాడని ఆశిస్తున్నాను.

- ముదిగంటి సుజాతా రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Kadupu Kotha