-
-
కడలి
Kadali
Author: Athaluri Vijayalakshmi
Publisher: Rajeswari Prachuranlu
Pages: 242Language: Telugu
సంతోషం లేని స్వర్గం ఎందుకు? ఆనందం ఇవ్వని ఐశ్వర్యం ఎందుకు? హృదయం వద్దనుకునే జీవితం ఎందుకు? కనిపించే ప్రతి పచ్చటి తోట వెనకా ఆ తోటను దహించి వేసే ముళ్ళకంపలు ఉంటాయి. ఆ ముళ్ళు అగ్నికణాల్లా రేగి తోటను దహిస్తే ఆ తప్పు తోటదా! మాలిదా! ఆనాడూ, ఈనాడు, ఏనాడూ స్త్రీ జన్మ సారవంతమైన పవిత్ర భూక్షేత్రమే. ఆ క్షేత్రం విషబీజాలు మొలకెత్తే మరుభూమిగా మారిందంటే అందుకు కారణం ఈ వ్యవస్థే..
మగాడి మనుగడకు బ్రహ్మే స్వేచ్చా శాసనం రాసాడు. అదే బ్రహ్మ స్త్రీకి అనేక నియమాలు, నిబంధనలు, ధర్మాలు, వల్లకాడు అంటూ నిర్ణయించాడు.
అదే శిలాశాసనంగా స్త్రీత్వాన్ని, అమ్మతనానికి, అనుభవానికి మాత్రమే పరిమితం చేసిన ఈ వ్యవస్థ పైన ఒక మహిళ తిరుగుబాటు ఈ “కడలి”. ఈ తిరుగుబాటు బావుటా ఎత్తుగా ఎగరచ్చు. నేలమీదికి వాలచ్చు. కానీ ఉనికిని మాత్రం చాటుతుంది.
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః..." అంటూ స్త్రీని గర్భగుడిలో దేవతగా భావించి పూజించేకన్నా ఒక మనసున్న మనిషిగా గుర్తించిన నాడే ఆమె వ్యక్తిత్వం వికసిస్తుంది... అస్తిత్వం పరిమళిస్తుంది..
- కె. ఉషారాణి
