• Jyothirao Phule Savitribai Phule
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే

    Jyothirao Phule Savitribai Phule

    Author:

    Pages: 23
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే

ఈ పుస్తకం గురించి..

ఈ పుస్తకం జోతిరావు, సావిత్రిబాయిల సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు.

2005 మార్చి నెలలో 'విజయవిహారం' పత్రికలో కవర్‌ కథనంగా 'బిసిల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్లు?' అనే సుదీర్ఘమైన విశ్లేషణాత్మక వ్యాసం వచ్చింది. ఈ వ్యాసాన్ని 2008 చివర్లో పుస్తకంగా తీసుకు రావడం జరిగింది.

'విజయవిహారం' అక్షరాల స్ఫూర్తితో, ఆ ఆశయాలను ఆచరణకు తెచ్చేందుకు 'విజయవిహారం' పాఠకుల వేదికగా 'జైభారత్‌' సంస్థ ఏర్పడిన తర్వాత ఎస్‌.సి., బి.సి., ఎస్టీ, నిరుపేదల, మహిళల సమస్యలపై ఎన్నో చారిత్రాత్మకమైన పోరాటాలను, కార్యక్రమాలను నిర్మించింది. ''చట్టసభలో బిసిలకు, మహిళలకు రిజర్వేషన్లు, ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ'' డిమాండ్లతో 2008 డిసెంబర్‌8న రాష్ట్రంలో జిల్లా, మండల స్థాయిలో వేలాది కార్యకర్తలతో జరిగిన 'జైభారత్‌ హల్‌చల్‌' కార్యక్రమంలో 'బిసిల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్లు?' పుస్తకాన్ని మండలాల స్థాయిలో సైతం సగర్వంగా ఆవిష్కరించుకున్నారు.

'బిసిల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్లు?' వ్యాసంలో రెండవ అధ్యాయం పేరు '5 వేల సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్ర'. ఈ అధ్యాయంలో 'జోతిరావు, సావిత్రిబాయి'ల గురించి ప్రస్తావించిన భాగాన్నే ఈ చిన్న పుస్తకంగా రూపొందించాం.

యువ పాఠకులకు 'జోతిరావు, సావిత్రిబాయి'ల గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుడి కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, ఆయన ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ప్రయత్నం ప్రేరేపించాలనేది మా ఆశ.

- జనహర్ష పబ్లిషర్స్‌

Preview download free pdf of this Telugu book is available at Jyothirao Phule Savitribai Phule