• Jwalitha Kousalya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్వలిత కౌసల్య

    Jwalitha Kousalya

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దశరథ మహారాజుగారి పట్టమహిషి, శ్రీరామచంద్రులవారి కన్నతల్లి. కౌసల్య గుండెల్లో ఏదైనా ఒక ఆవేదన వుంటుంది అంటే ఎవరూ నమ్మరు. కానీ ఆవిడ నిప్పులు మూటగట్టుకుని కూర్చుంది.

వనవాసానికి బయలుదేరుతూ ఆశీస్సుల కోసం వచ్చిన కన్నకొడుకుని చూడగానే ఆ మూట భగ్గుమంది. పేరుకి పట్టమహిషినే కానీ మీ నాన్నగారి నిర్వాకంలో నా బతుకు దాసి కన్నా కనాకష్టం అయిపోయింది. నువ్వు రాజువైతేనన్నా సుఖపడదామనుకున్నాను. అది కూడ అడియాసే అయ్యిందా - అని బోరున విలపించింది. వాల్మీకి ఏ దాపరికమూ లేకుండ కౌసల్య కడుపుమంటని సరాసరి ఇరవై శ్లోకాల్లో వర్ణించాడు.

వీటిని చదివి అనుమాండ్ల భూమయ్యగారు కదిలిపోయారు. అనువదించారు. అదే బాణీలో మరిన్ని భావాలను మెదిపి ఆ ఘట్టాలన్నింటినీ జ్వలిత కౌసల్య అనే లఘుకావ్యంగా రచించారు.

వీరి కావ్యాలన్నింటా తేటగీతులూ ఆటవెలదులే. జ్వలిత కౌసల్యలో ముత్యాల సరాలూ ముగింపులో ఒక శార్దూలం వున్నాయి. వీరి పద్య నిర్మాణశైలి వచనానికి దగ్గరగా వుంటుంది. అయితే వారి బాణీలో చదువుతొంటే పద్యం నడక హాయిగానే వుంటుంది.

- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

Preview download free pdf of this Telugu book is available at Jwalitha Kousalya