• Jumma Kathalu 2014
  • fb
  • Share on Google+
  • Pin it!
 • జుమ్మా కథలు 2014

  Jumma Kathalu 2014

  Publisher: Sufi Prachuranalu

  Pages: 140
  Language: Telugu
  Rating
  2.33 Star Rating: Recommended
  2.33 Star Rating: Recommended
  2.33 Star Rating: Recommended
  2.33 Star Rating: Recommended
  2.33 Star Rating: Recommended
  '2.33/5' From 3 votes.
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  '3/5' From 2 premium votes.
Description

" 'కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం' పొందిన కథలు ఇవి". ఫిబ్రవరి 2014లో వెలువడిన రెండవ ఎడిషన్ ఈబుక్ ఇది.

* * *

వేంపల్లె షరీఫ్ కథల్లోని జీవితం తెలుగు జీవితం. భారతీయ సమాజంలోణి ఒక సముదాయమైన గ్రామీణ పేద ముస్లిం పిల్లలు, యువతీ యువకులు, తల్లిదండ్రులు, నానమ్మలు, అమ్మమ్మలు - వీళ్ళందరి అస్తిత్వవేదనను, ఘర్షణను, ఆకాంక్షలను, విఫల మనోరథాలను, భౌతిక మానసిక జీవితాలను చిత్రించడాన్ని ఈ కథలలో చూడవచ్చు.

షరీఫ్ కథల్లోని ఇతివృత్తాలను, నేపథ్యాన్ని, పాత్రలను, కంఠస్వరాన్ని, శైలిని నిశితంగా పరిశీలించినప్పుడు షరీఫ్ నేల మీద నిలబడి రాస్తున్న అచ్చమైన కథకుడని మనం గ్రహిస్తాం. ఆ నేల, ఆ గాలి, ఆ నీరు ఎక్కువగా తన అనుభవంలోని పల్లెపట్టులవి. తన చుట్టుపక్కల మనుషులవి.

- కేతు విశ్వనాథరెడ్డి

'జుమ్మా' కథల సంపుటిలోని కథలు సున్నితంగా, హృదయానికి హత్తుకునేటట్లు గానూ, ఆలోచింపచేసేట్లుగానూ ఉన్నాయి. రాయలసీమలోని పేద ముస్లింల జీవన విధానాన్ని, సంస్కృతిని అందరికీ తెలిసేటట్లు ఆర్ద్రంగానూ, అందంగానూ రాశారు. ఎక్కడా కసి, కక్షలాంటి వాటిని ప్రదర్శించకుండా, మానవత్వాన్ని మేల్కొల్పేటట్లుగా ఉన్నాయి. ఇటువంటి మంచి కథా వస్తువులను తీసుకుని, చదివించే సరళమైన శైలిలో, మంచి శిల్పనైపుణ్యంతో కథలు రాసినందుకు నా హృదయపూర్వక అభినందనలు.

- అబ్బూరి ఛాయాదేవి

* * *

సామాజిక, సామూహిక, సత్ప్రవర్తనను అలవర్చుకోవాల్సిన వర్తమాన స్థితిని ఈ కథలు గుర్తుచేస్తాయి. ఒక మహా సమూహంలో ఉండి కూడా ఒంటరిగా జీవితాలను వెళ్ళబుచ్చాల్సిన ఒక దౌర్భాగ్యస్థితి ఈ దేశంలో ముస్లింలకు ఉండడాన్ని ఈ కథలు ప్రశ్నిస్తాయి. ఈ కథలన్నీ విన్నతర్వత శ్రోతల మానసిక ప్రపంచం విశాలమవుతుంది. ఒక సామాజిక, సాంస్కృతిక వారధి
మీద మనం ప్రయాణం చేస్తాం. 'మతం వేరైతేనేమోయ్... మనసులొక్కటై మనుషులు ఉంటే' అన్న మహాకవి గురజాడ మాటలను జుమ్మా కథలు నిజం చేస్తాయి.

- సింగమనేని నారాయణ

* * *

వస్తువు, శిల్పమూ సమతూకం చెంది, సఫలం పొందిన కథగా చెప్పుకోదగ్గ కథ వేంపల్లె షరీఫ్‌ "పర్దా'. ఇందులో మనం చూడవలసిన, సహానుభూతితో అర్థం చేసుకోవాల్సిన జీవిత దృశ్యముంది. దాన్ని ఏమేరకు చెప్పాలో, ఎక్కడ వదిలిపెట్టాలో తెలిసిన నేర్పుతో కథ చెప్పాడు కథకుడు. రచయిత పేరు లేకుండా ఈ కథ చదివి ఉంటే నేను బహుశా ఇది ‘ప్రేమ్‌‌చంద్‌’ కథ అనుకునేవాణ్ని.

- వాడ్రేవు చినవీరభద్రుడు

Preview download free pdf of this Telugu book is available at Jumma Kathalu 2014
Comment(s) ...

Prabhakar Ak చివరి మాట, కడప ఆలిండియా రేడియోలో ప్రసారమైన ప్రముఖుల అభిప్రాయాలు, గౌహతిలో సాహిత్య అకాడెమి యువపురస్కారం తీసుకుంటున్న సందర్భంగా రచయిత చేసిన ప్రసంగం, కథల నేపథ్యం, అనువాదకుల అభిప్రాయం తదితర విషయాలు అనుబంధంగా ఉన్నాయి.

ఈ రెండవ ముద్రణలో, పాత పుస్తకంలో లేని, కొత్తగా ఉన్న, విశేషాలేమిటి?