-
-
జిగిరి
Jigiri
Author: Peddinti Ashok Kumar
Pages: 136Language: Telugu
గుడ్డెలుగు ఒక క్రూర జంతువు. అడవి నుంచి ఊరికి వచ్చి మనుషులతో స్నేహం చేసి మృగలక్షణాలను పోగొట్టుకొని సాధువై పోతుంది. కాని సాధువులా ఉండాల్సిన మనిషి మృగమై పోతాడు. మృగలక్షణాలున్న మనిషికి, సాధు లక్షణాలు ఉన్న మృగానికి మధ్య స్నేహాన్ని, సంఘర్షణను హృద్యంగా చిత్రించిన నవల జిగిరి. ఇది ఇప్పటి వరకు హిందీ, ఆంగ్లము, పంజాబీ, మరాఠీ, ఒరియా, కన్నడ, బెంగాలీ భాషలలోకి అనువాదమైంది. ఆయా భాషల పాఠకుల ఆదరణ పొందిన ఈ నవల తెలుగులో తొలిసారి పుస్తక రూపంలో వెలువడింది.
* * *
పెద్దింటి అశోక్‌కుమార్ కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం లోని భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్య. గంభీరరావుపేటలో ఇంటర్మీడియేట్, సిద్ధిపేటలో బి.ఎస్సీ, కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఎస్సీ (మ్యాథంమెటిక్స్) చదివారు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎడ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇల్లంతకుంట మండలంలోని రామాజీపేటలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 1999లో తొలి కథ 'ఆశ నిరాశ ఆశ' ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో అచ్చయింది. తొలి నవల 'ఎడరి మంటలు' చతుర మాసపత్రికలో వచ్చింది. ఇప్పటివరకు మొత్తం అయిదు నవలలు (ఎడరి మంటలు, ఊరికి ఉప్పులం, సంచారి, జిగిరి, దాడి), దాదాపు వంద కథలు రాశారు. తెలుగు సాహిత్యంలో గల్ఫ్ వలసల మీద తొలిసారి వెలువడిన నవల 'ఎడరి మంటలు'. అదేవిధంగా వలసల ఇతివృత్తంగా వచ్చిన కథలతో వెలువడిన సంపుటి 'వలస బతుకులు'. ఏడు కథలు హిందీ లోకి అనువాదమయ్యాయి. హిందీలో త్వరలో కథా సంకలనం రానుంది. అనేక కథలకు బహుమతులు వచ్చాయి. అయిదు కథా సంపుటాలు ప్రచురితమయ్యాయి. ''పాఠశాలనే నా ప్రయోగశాల. పిల్లలకు పాఠాలు చెప్పడమన్నా, కథలు రాయడమన్నా నాకు ఎక్కువ ఇష్టం'' అని చెబుతున్న అశోక్‌కుమార్ తెలుగు సాహిత్య సంపన్నతకు దోహదం చేస్తున్నారు.
This book Jigiri is really a good one. The way the characters were brought to life and I could feel the sense of innocence of people living in remote village and at the same time the other side of humans where in they even prepared to get rid of their pet was portrayed very well sir.