-
-
ఝంఝోటి
Jhamjhoti
Author: P. S. Narayana
Pages: 88Language: Telugu
"వసంతా! దుఃఖించ తగని వారిని గూర్చి దుఃఖించటం అవివేకం.. బాల్యం మనకు తెలియని వయస్సు.... యవ్వనం మన ఆనందానికి చిహ్నం.... వార్థక్యం మనం మరొకరికి దారి చూపించే వయస్సు.... ఏ వయస్సులో మనిషి ఆ వయస్సు పనులు చేయటం.... మనం మన విధులను సక్రమంగా నిర్వహించడం అన్నమాట!"
ఆమె నాకళ్ళల్లోకే చూస్తోంది.
"వసంతా! పుట్టిన మనిషికి మరణమెలా తప్పదో... దాంపత్య జీవితాన్ని గడపడమూ తప్పదు... మగవాడైతే తండ్రి.... ఆడదైతే తల్లీ అయితేనే వారి జీవితానికి ధన్యత కలిగినట్లు!".
నేను చేస్తున్న బోధనల్లోని నిజాన్ని ఏ కొంచమయినా ఆమె గ్రహించగలిగితే, ఆమె భవిష్యత్తుకు ఆమే పూలబాట వేసుకోగలదు... లేదా... అంతే... ఇక ఆమె జీవితం అంతే... ఆమె బ్రతుకు అంతే... ఆమె సమాధి చెందినట్లే!
"వసంతా! దీపం వెలిగించు... చిన్నదైనా ఒక దీపాన్ని వెలిగించుకో... నీ చుట్టూ వున్న చీకటిని చీలుస్తున్న ఆ వెలుగులో నీ ఆనందాన్ని చూసుకో... నీ భవిష్యత్తును చూసుకో... నీ బాగుని చూసుకో... నీ మేలుని చూసుకో... నిన్ను నువ్వు చూసుకో!"
"ఎలా?" నీరసంగా బావిలోనుండి వస్తున్నట్లుగా ఉన్నది ఆ కంఠధ్వని.
నా చేయి అయితే వణకటం లేదు.... వణుకుతున్న ఆమె చేతిని పట్టుకున్నట్లే వున్నది ఆ క్షణాన!
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా మరల "ఎలా?"అన్నది - ఈసారి బలంగా వున్నది కంఠం.
