-
-
జీవితానికి మూలాధారమైన వ్యవసాయం
Jeevitaniki Muladharamaina Vyavasayam
Author: Manchi Pustakam
Publisher: Manchi Pustakam
Pages: 174Language: Telugu
ఇది సర్ ఆల్బర్ట్ హవార్డ్ రచించిన 'యాన్ అగ్రికల్చరల్ టెస్టామెంట్'కి సంక్షిప్త అనువాదం. అనువాదకులు కె. సురేష్.
మానవ సమాజాల సుదీర్ఘ… చారిత్రక పరిణామంలో జీవనానికి అన్ని మౌలిక అవసరాలను అందించటంలో వ్యవసాయం కీలకపాత్ర పోషించింది. ఈనాడు వ్యవసాయం లేకపోతే పెద్ద ఎత్తున ప్రజలు ఆకలికి గురి అవుతారు. వ్యవసాయం ఈనాటికీ కేంద్ర స్థానాన్ని ఆక్రమిస్తోంది, భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుంది.
అయితే, ఆకలి సమస్య పెరగటాన్ని పరిగణనలోకి తీసుకుంటే ''ప్రపంచంలో ఉన్న కోట్లాది ప్రజల ఆకలి తీర్చే వ్యవసాయం ఏది?'' అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఈ ప్రశ్న, దాని సమాధానంతో మనం తలపడాలి.
పై ప్రశ్న నేపధ్యంలో 1940లో ప్రచురితమయిన ఆల్బర్ట్ హవార్డ్ రాసిన 'ద అగ్రికల్చరల్ టెస్టామెంట్', 70 ఏళ్ళ నాటి కంటే ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది.
ప్రకృతి పని తీరుపై లోతైన అధ్యయనంతో కూడుకున్న పుస్తకం ఇది. మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలను, దానికి సమాధానాలను ఇది చక్కగా పొందుపరిచింది. మానవజాతి పోరాటాలలో ఈ పుస్తకం మనకు ఎంతగానో దోహదపుతుంది.
