-
-
జీవిత వికాసం (సేత్ విజ్ఞానం)
Jeevita Vikasam Seth Vignanam
Author: V V Ramana
Publisher: Akshara Publications
Pages: 47Language: Telugu
మిమ్ములను మీరు అమితంగా ప్రేమించగలిగినపుడే మీపట్ల + సర్వ జీవాత్మల పట్ల మాతృ సహజ ప్రేమను + ఓర్పును కలిగి వుంటారు.
వ్యక్తిత్వ వికాసం అంటే ఇతరులతో పోటీ పడడం కాదు. తన అంతర్శక్తిని ఉపయోగించి జీవితంలో అన్ని కోణాలలో వృద్ధి చెందుతూ సకల కళాపారంగతుడు కావడమే. వ్యక్తిత్వ వికాసం అంటే - ఈ విశ్వంలో అపారమైన ఐశ్వర్యం, సంపద సమృద్ధిగా వున్నాయని సంపూర్ణంగా విశ్వసించి వాటిని మీ జీవితానుభవాల వినియోగంలోనికి తీసుకు వచ్చేందుకు అన్నింటియందు నాణ్యతకోసం కష్టించి (ఫలితాన్ని ఆతృతతో ఎదురు చూడకుండా) పనిచేయడమేనని మీరు తెలుసుకోవాలి.
ఈ విశ్వసృష్టిలో అపారమైన సంపద ఇమిడి వుంది. ఎవరు ఎంతెంతగా సాధన చేస్తుంటారో అంతంతగా సంపదను సముపార్జించుకుంటుంటారు. ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద, భావ సంపద, జ్ఞాన సంపద, మరేదైనా కావచ్చు వాటిని విభజించి చూడకండి. అన్నీ కలిపితే జీవిత సంపద అవుతుంది.
- వి. వి. రమణ
