-
-
జీవించు - నేర్చుకో - అందించు (రెండవ సంపుటం)
Jeevinchu Nerchuko Andinchu 2
Author: Tummeti Raghottama Reddy
Pages: 242Language: Telugu
కొత్త తరానికి సరికొత్త సాహిత్యం!
కొటేషన్‌ని ఒక ప్రక్రియగా స్వీకరించి, మానవ జీవితాన్ని దానిలోని వేలాది సూక్ష్మ విషయాల్ని శాస్త్రీయంగా లయభరితంగా వ్యాఖ్యానించిన గొప్ప కోట్స్ బుక్.
* * *
...ఇది రత్న భాండగారం. మంచినీ, మంచి ఆలోచననీ సమీకరించే ఏ జిజ్ఞాసినయినా ఆకర్షించే ప్రయత్నిమిది. అలాంటి చక్కని కృషిని మూడోసారి చేస్తున్నారు రఘోత్తమరెడ్డిగారు. లోగడ ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. ఆ రుచి మరిగిన జిజ్ఞాసి - సహృదయులయిన పాఠకులకి ఆ రుచిని మప్పారు. సంపుటాల వెలువరింతలో యిది రెండో ప్రయత్నం.
- గొల్లపూడి మారుతిరావు
* * *
నాకు ఈ పుస్తకం ఒక గొప్ప స్పూర్తిని అందించింది.... ఆధునిక కాలంలో ఏ శీర్షికలో, ఏ ప్రక్రియలో రికార్డు కాకుండా మిగిలిపోతున్న అంశాలను మనం ఈ ప్రక్రియ ద్వారా రికార్డు చేయవచ్చని తుమ్మేటి రఘోత్తమరెడ్డి మనకొక దారి చూపించారు... ఈ గ్రంథం తెలుగులో ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇలాంటి ఎన్నో గ్రంథాలు వెలువడానికి స్పూర్తినిస్తుంది.
- బి.ఎస్. రాములు
* * *
తెలుగుకు పరిమితులు ఎక్కువగాని, లేకపోతే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు బుక్షాపీ స్టాండ్స్‌లో కూడా మన యువతకు అందుబాటులో ఉండవలసిన గ్రంథమిది.
- జాన్సన్ చోరగుడి
* * *
ఈ కోట్స్ రఘోత్తమరెడ్డి జీవితం నుంచి, అవగాహన నుంచి, పరిశీలన నుంచి పుట్టినవి. జీవితాన్ని జీవన ప్రవాహపు ఒడ్డున నిల్చుని కాకుండా ఆ ప్రవాహంలో భాగంగా పారుతూనే తల పైకెత్తి, చుట్టూ గమనించి వ్యాఖ్యానం చేసినట్టు ఉంటాయి.
- ముళ్లపూడి సుబ్బారావు
* * *
ఏదేని పరిస్థితుల వల్ల మనం సాధారణ స్థితిని కోల్పోయినపుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నపుడు ఈ పుస్తకం చదివితే, దానికి పరిష్కారం లభిస్తుందని నేను బలంగా నమ్ముతా.
- తాయమ్మ కరుణ

- ₹60
- ₹162
- ₹432
- ₹324
- ₹108
- ₹108