-
-
జీవించు - నేర్చుకో - అందించు
Jeevinchu Nerchuko Andinchu
Author: Tummeti Raghottama Reddy
Pages: 136Language: Telugu
ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర ' కోట్స్' రచన
ఒక తరంలో ప్రోది చేయబడ్డ జీవన జ్ఞానాన్ని తరువాత తరానికి అందజేయడం సాహిత్యం లక్ష్యాలలో ముఖ్యమైనది. ఇలాంటి లక్ష్యంతో చేయబడ్డ ప్రయత్నం ఈ చిన్న పుస్తకం. సాహితీ సృజనలో పాల్గొన్న వ్యక్తి తన జీవిత అనుభవాల అధ్యయనాల ఆధారంగా రాసిన వాక్యాలు. ఈ ప్రత్యేకత దృష్ట్యా వీటిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంగ్లీషు కోట్స్ పుస్తకాలతో పోల్చలేము.
ఇవి కొన్ని సార్లు కోట్స్ గానూ, కొన్ని సార్లు స్టేట్మెంట్స్ గానూ అనిపిస్తాయి. వీటిలో కొన్ని వాక్యాలు సార్వజనీనాలుగా ఉంటాయి. కొన్ని ఆత్మాశ్రయాలుగా అనిపిస్తాయి. కొన్ని కొందరికి అంగీకారం కాకపోవచ్చు. ఒక్కొక్క వాక్యం గమనిస్తే అది ఒక కథకు సారాంశంగా కూడా అనిపిస్తుంది. రచయిత కథను అర్థం చేసుకుని ఇష్టపడే వారికి ఆ వాక్యాలు నచ్చుతాయి.
కొన్ని వాక్యాలను అర్థం చేసుకోడంలో పాఠకుని ఇంటర్ప్రెటేషన్ అవసరం పడుతుంది. ఇందులో కొన్ని వాక్యాలు ఇది వరకు వేరేవారు చెప్పినవిగా కనిపిస్తాయి. (చాలా తక్కువగా) అవి ఒక అవసరం రీత్యానే ఆ టాపిక్కును సంపూర్ణం చేయడానికి ఇందులో చేర్చబడ్డాయి.
ఈ కృషి మొత్తం, రచయిత ఇప్పటి దాక చేసిన రచనల సారాంశంగా, అతని జీవన దృక్పథంగా, అతని జీవితావగాహనగా నేను భావిస్తాను.
- ముళ్ళపూడి సుబ్బారావు
(కథారచయిత-అకౌంట్స్ మేనేజర్, సింగరేణి కాలరీస్, గోదావరిఖని)

- ₹60
- ₹162
- ₹432
- ₹324
- ₹108
- ₹108