-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
జీవనం సత్యం జీవనం సుందరం (free)
Jeevanam Satyam Jeevanam Sundaram - free
Author: Multiple Authors
Pages: 106Language: Telugu
ప్రసిద్ధి ఒడియారచయిత, జ్ఞానపీఠపురస్కార స్వీకర్త గోపీనాథ మొహాంతి ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో నివసిస్తున్న పురాతన గిరిజనతెగ కోదుల మీద రాసిన మహేతిహాసం “అమృతసంతానం' నవలని సాహిత్య అకాడెమీ కోసం పురిపండా అప్పలస్వామి తెలుగుచేసారు. ఆ నవలని ఇటీవల కొందరు సాహిత్య మిత్రులు చదివి తమ స్పందనల్ని ఫేస్బుక్ మాధ్యమంగా మిత్రులతో పంచుకున్నారు. తొమ్మిదినెలల స్వల్ప వ్యవధిలో ఒక నవలపైన ఇన్ని వ్యాసాలు రావడం, అది కూడా ఒక అనువాదకృతి పైన రావడం, తెలుగు సాహిత్య చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ నవలపట్ల ఆత్మీయంగా స్పందించిన వారిలో మూడు తరాలకు చెందిన సాహిత్యవేత్తలు, సాహిత్యాభిమానులు, సాహిత్యవిద్యార్థులు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో గల అపారమైన ఖనిజ వనరులవల్ల అక్కడ జీవిస్తున్న ఆదివాసుల మనుగడనే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఈ నవలకు విశేష ప్రాసంగికత ఏర్పడిందని మానవ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్న తరుణంలో అమృతసంతానం నవలారచయితకు, అనువాదకర్తకు తెలుగుసాహిత్య ప్రపంచం సమర్పిస్తున్న నీరాజనం ఈ సంపుటం.

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE