-
-
జీవనది – రక్తం కథ
Jeevanadi Raktham Katha
Author: Vemuri Venkateswara Rao
Publisher: Kinige Digital Technologies Pvt. Ltd.
Language: Telugu
ఈ పుస్తకం చాలా అపురూపమైనది. అద్భుతమైనది. తెలుగులో శరీర విజ్ఞానశాస్త్రంలోని ఒక అంశాన్ని ఇంత సులభంగా, సుగమంగా, సురుచిరంగా, సుందరంగా, సునిశితంగా చెప్పే ప్రయత్నం ఇంత వరకు జరగలేదు కదా! ఆ గొప్ప లోపాన్ని ఎంతో చక్కగా ఈ పుస్తకం పూరిస్తుంది.
ఆధునిక వైద్యవిజ్ఞానం, శాస్త్ర పరిభాష తెలియని పాఠకుడు కూడా (సంగీత శాస్త్రం తెలియక పోతేనేం – చక్కగా పాడే వారి పాట విని పరవశించగలమా? లేమా?!) ఆనందంగా చదివి ఆహ్లాదకరంగా తెలుసుకోవడానికి ఎంతో అనువుగా వుంది ఈ ప్రయత్నం.
అన్నట్లు 'ప్రయత్నం' అంటే ప్రకృష్టమైన యత్నం. గొప్ప పని అన్న మాట. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని కథలలాగా నవలలాగా చదివించటం ఎంత కష్టం!?
జీవం అంటే నీరు. నీరు లేనిది సృష్టి లేదు. నిరాకారం నీరాకారం అయితేనే సృష్టి. అందువలన మానవ జీవన ప్రవాహాన్ని అభివర్ణించే ఈ పుస్తకానికి జీవనది అని పేరు పెట్టడం ఎంతో బాగుంది.
ప్రకృతి పురుష సంయోగం లేకపోతే సృష్టి లేదన్నారు మన వేదాంతులు. సంయోగం అంటే పరిపూర్ణమైన సహయోగం. స్త్రీ పురుష జన్యువుల సంయోగాన్ని, సహయోగాన్ని ఎంతోచక్కగా వివరించారు వెంకటేశ్వరరావు గారీ పుస్తకంలో.
లలితా సహస్రనామంలో అమ్మవారిని 'రక్తనిష్టా' అని 'రుధిరా సంస్థితా' అని పరిపరి విధాల రక్తితో స్తుతించడం కనబడుతుంది. ఆమె అరుణ. కనుక సంకేతంగా జీవశాస్త్రం కూడ సనాతన విజ్ఞాన నిధిలో లేకపోలేదనిపిస్తుంది. అది విషయాంతరం.
ఈ పుస్తకం తెలుగు నేర్చి అర్థం చేసుకోగలవారందరూ చదివితే ఎంతో బాగుండును. అని ఆశంస, ఆకాంక్ష. తెలుగు వారి విజ్ఞాన శాస్త్ర అభిరుచికి ఈ పుస్తకం ఒక మార్గదర్శిక.
అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)
శాన్ హోజే, కేలిఫోర్నియా
జూన్ 5, 1998
రచయిత గురించి:
వేమూరి వేంకటేశ్వరరావు....
పుట్టుక, విశాఖపట్నం జిల్లా, చోడవరంలో. పెరగడం, తూర్పు గోదావరి జిల్లా తునిలో. విద్యాభ్యాసం పాపయ్య మేష్టారి వీధి బడిలో, రాజా వారి ఉన్నత పాఠశాలలో. ఇంటరు క్రిష్ణా జిల్లా బందరు హిందూ కళాశాలలో. తదుపరి కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో. ఉద్యోగం నేవేలీలో నాలుగు నెలలు, భిలాయిలో మూడేళ్లు. తరువాత అమెరికా ప్రయాణం. డిట్రాయిట్లో కొన్నాళ్లు, లాస్ఏంజిలిస్లో కొన్నాళ్లు చదివి ఇంజనీరింగులో Ph. D. పట్టా. తరువాత అనేక ఊళ్లల్లో రకరకాల ఉద్యోగాలు చేసి - కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిలో ఉంటూ - 2011 లో ఉద్యోగ పర్వం నుండి విరమించేరు. కథకాని కథ అనే కార్డు కథతో మొదలయిన రచనా వ్యాసంగం అలా సాగుతూనే ఉంది. తెలుగులో కథానికలు, వ్యాసాలు, బ్లాగులతో పాటు కొన్ని పుస్తకాలు కూడ రచించేరు. బర్క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో స్థాపించబడ్డ తెలుగు పీఠాన్ని శాశ్వతం చెయ్యడానికి friendsOfTelugu.org అనే సంస్థ తరఫున తీవ్రంగా కృషి చేస్తున్నారు.
- FREE
- FREE
- FREE
- ₹162
- ₹162
- ₹162
Could you please provide your help desk phone number. Ph num 040-23008100 is not working
ఈ పుస్తకం గురించి రచయిత తన బ్లాగులో వ్రాసుకున్న టపా జీవనది: రక్తం కథ
Vemuri Venkateswra Rao gari "Rasagandha Rasayanam" nenu 23 ella kitham print chesanu. Vaari rachana chaala saralam gaa vuntundi. Adi kudaa meeru testhe baavuntundi..
----
Appaji Ambarisha Darbha on Facebook
For those who can understand Telugu langauge, but cannot read Telugu script, this book is now available in Tenglish script also! Click here to access the same.