-
-
జీవనయాత్ర
Jeevana Yatra
Author: Madireddy Sulochana
Publisher: Navodaya Publishers
Pages: 262Language: Telugu
''విజయా!'' ఎంత సాధారణంగా ఉండాలనుకున్నా, కంఠం కఠినంగానే ధ్వనించింది. అన్న నోటినుండి ఆ పిలుపు కొత్తగా వున్నది. అందుకే హడలి పోయింది.
''ఇలా రా!'' అన్నాడు మళ్ళీ. విజయ వెళ్ళి అన్న ప్రక్కన సోఫాలో కూర్చుంది.
''విజయా! ఇటు చూడు. నేనో ప్రశ్న అడుగుతాను. జవాబు చెబుతావా?''
''ఏమిటన్నయ్యా!'' అన్నది అస్పష్టంగా.
''శ్రీధర్, నువ్వు పెళ్ళి చేసుకుందామనుకుంటున్నారా''
సూటిగా ప్రశ్న వచ్చేసరికి తికమక పడింది విజయ.
''మాట్లాడవేం?'' గర్జించాడు.
''ఆ'' అన్నది.
''ఎంత సాహసం! మీ యిద్దరి ఇష్టమేనా? పెద్దల అనుమతి అక్కరలేదా? అతడు బ్రాహ్మణుడు. మనతో పొత్తు ఎలా కుదురుతుంది. ఒకవేళ ఎవ్వరినీ లెక్కచెయ్యక పెళ్లి చేసుకున్నా, దాని పరిణామం ఆలోచించావా? వాళ్ళు నిన్ను రానిస్తారా? నువ్వు వాళ్ళలో కలసిపోగలవా? మనకు అమ్మ ఎలాగూ లేదు. స్వతంత్రులం. ఆయనకుంది తల్లి, ఆమె హృదయం ఎంత బాధపడుతుందో! తప్పంతా మాది. శ్రీధర్‌కు చనువిచ్చాం'' అన్నాడు ఆవేశంగా.
* * *
పాఠకులకు ఉత్కంఠ కలిగిస్తూ, చివరిదాకా ఆసక్తిగా చదివించే నవల ఇది.
