-
-
జీవన విద్య - ఎస్.ఆర్. బుక్ లింక్స్
Jeevana Vidya S R Book Links
Author: D.V. K. Vasudevan
Publisher: S.R. Book Links
Pages: 103Language: Telugu
విద్య ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? విచక్షణతో గూడిన విజ్ఞానాన్ని అందించి తద్వారా చక్కని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం. వ్యక్తిత్వం లేని మనిషి, విచక్షణ లేని విజ్ఞానం ఎందుకూ పనికిరావు.
విద్య జీవించడం ఎలాగో నేర్చుకోవడానికా లేక డబ్బు సంపాదనకా అన్న ప్రశ్నలకు రెండవది సమాధానం అంటే అతిశయోక్తి కాదు. విద్యార్థులు మార్కులు మాత్రమే సాధించే యంత్రాలుగా తయారవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రతి విద్యార్థికీ విద్య అంతరార్థం ఏమిటి? ఎందుకు విద్యని అభ్యసిస్తున్నాం? దాని గమ్యం ఏమిటి? అన్న విషయాలను తెలపాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులు, పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులూ, నేతలపైన ఉంది.
విద్యార్థన ద్వారా మనిషి జీవితంలోని విషయాలను తెలుసుకునీ, విచక్షణా జ్ఞానంతో, మంచి చెడుల తారతమ్యాన్ని గమనించి తద్వారా తనదైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ విధంగా మంచి వ్యక్తిత్వంతో, సమాజంలో హుందాగా, సగర్వంగా జీవిస్తూ వ్యక్తి సమాజాభివృద్ధికి కృషి చేయడమే విద్యార్థన ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి విద్యార్థికీ ప్రత్యేకించి ప్రతి వ్యక్తికీ వుండవలసిన, ఆచరించవలసిన "జీవన విలువలు" వాటి ప్రాధాన్యం, అవి లేకపోతే జీవితంలో మనిషి కోల్పోయే విషయాలను, జాతిపిత మహాత్మాగాంధీ జీవితంలో జరిగిన అంశాలను కథలుగా చెపూ, ఆ అంశాలను ప్రస్తుత సమాజస్థితులకు అన్వయిసూవిలువలతో కూడిన ఒక సరికొత్త జీవన విధానాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ పుస్తకం.
- డి.వి.కె. వాసుదేవన్

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6