-
-
జీవన వైవిధ్యం
Jeevana Vaividhyam
Author: Kekalathuri Krishnaiah
Language: Telugu
ఇది స్తవం కాదు! వాస్తవం!
ఇప్పుడు మీ చేతిలో వున్నది కావ్యమూ కాదు, కవితా సంకలనమూ కాదు. మరింకేమిటి? అసాధారణమైన కృషితో, అనన్య సామాన్యమైన శేముషితో తనకు తానే గురువుగా, తనకు తానే మార్గదర్శకుడుగా తనను తాను తీర్చిదిద్దుకున్న ఒక మహోన్నత వ్యక్తి జీవిత దర్పణం. ఈ అద్దంలో అగుపించే దృశ్యాలు మనల్ని ఆశ్చర్యచకితులని చేస్తాయి. ఆయన పల్లెలో ఉన్నా, పట్టణంలో ఉన్నా మనసు ప్రపంచాన్ని అన్వేషిస్తూ వుంటుంది. సంకల్పబలం, సాహసం వుంటే సాధించలేనిదేమీ వుండదని ఆయన విశ్వాసం. వారు రచించిన ప్రతీ పుస్తకం జీవిత పరమార్ధానికి కరదీపికగా భాసిల్లుతుంది. ప్రస్తుతం వారి కీర్తి పతాక దేశవిదేశాలలో సగర్వంగా రెపరెపలాడుతూ వుంది.
వారు పూర్తి చేసిన ప్రాజెక్టులు భారతీయుల నైపుణ్యానికి సజీవ సంకేతాలు. ఇన్ని ఘనతలు ఒకే వ్యక్తిని వరించడం చాలా అరుదైన విషయం. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న వ్యక్తి పేరు కేకలతూరి క్రిష్ణయ్య. వారు కనుచూపుకందని దృశ్యాల నెన్నింటినో మన కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తారు. ఇది స్తవం కాదు! వాస్తవం!
- సహజ కవి డా. మల్లెమాల
స్పష్టమైన సాధనా సంపత్తి
స్పష్టమైన సాధనా సంపత్తిచే ఆర్జించిన విశేష జ్ఞానము సమాజమునకు ఉపయోగపడునట్లు చదివిన వెంటనే పాఠకులు అర్థము చేసుకునేటట్లు చక్కటి భావము వ్యక్తం చేయు నైపుణ్యముతో శ్రీ కేకలతూరి కృష్ణయ్య గారు రచించిన "జీవన వైవిధ్యం" అను ఈ గ్రంథము ప్రతీ ఒక్కరు చదవదగినది.
మధుర గంభీర గమనంతో, తార్కిక మానవత్వ విశ్లేషణా విజ్ఞానమయ ప్రకాశంతో, సమాజోద్ధారణాభిలాషాకండూతితో, సున్నిత మందలింపులతో, సూక్ష్మ క్రాంత దృష్టితో నిండుదనము నెలకొన్న "నేటి మానవత్వము"ను విశదీకరించి, విశాల విశ్వ వినిర్మల భక్తితో యింపుగొలుపు ఈ గ్రంథరాజమునకు సముచిత రీతిలోనే భావ వ్యక్తీకరణ జరిగినది. ఉపాన్యాసధోరణిలో సాగిన ఈ శైలి గౌరవ విజ్ఞులు, తార్కికులు, తత్వవేత్తలు ఆలోచించి తృప్తి పరిచేరీతిగా, రచయిత హృదయం నుండి బహిర్గతమై మాన అవసరమైన సర్వ విషయ సమ్మేళనమై యొప్పుచున్నది.
- విద్వాన్ బి. మునుస్వామి,
చిత్తూరు

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56