-
-
జీవన పోరాటం
Jeevana Poratam
Author: Ganti Bhanumathi
Publisher: Ganti Prachuranalu
Pages: 211Language: Telugu
ఎంత చిన్న విషయాన్ని తీసుకొన్నా దాన్ని కథగా అల్లగల నేర్పు శ్రీమతి భానుమతిలో కనిపిస్తుంది. చదివించగల చక్కని గుణమూ ఆమె కథల్లో ఉంది. ఆధునిక జీవనసమస్యల సాలెగూళ్ళు కథల్లో ప్రతిబింబిస్తాయి.
ముందు ముందు, భానుమతిగారి కథలు, కళ్ళను మెరిపించడంతోబాటు, మనసును మురిపించడంతోబాటు, గుండెను కదిలించేటట్లూ అనుభూతిగాఢతను పెంచేటట్లూ చేయగలవని ఆశించవచ్చు. కథామతి భానుమతిగారికి అభినందనలు.
- పోరంకి దక్షిణామూర్తి
* * *
ఈమె కథల్లో ఇతివృత్తం కేవలం స్త్రీలకు సంబంధించినదే కాదు.
ఏ సంఘటన ఆమె మనసును కుదిపిందో దానికి చక్కటి వర్ణన జోడించి కథగా రూపుదిద్ది పాఠక లోకాన్ని ఆకర్షించే విధంగా రచించగల నేర్పు భానుమతి గారి కలానికున్న గొప్ప లక్షణం.
ఈ 'జీవన పోరాటం' కథానికా సంపుటి ప్రచురించి పాఠకలోకానికి అందిస్తున్నందుకు మనసారా అభినందిస్తున్నాను. త్వరలోనే మరో సంకలనం వెలువడాలని కోరుకుంటున్నాను.
- డా. వాసా ప్రభావతి
