-
-
జీవన మైత్రి
Jeevana Maithri
Author: Swami Maitreya
Publisher: S. M. S. Publications
Pages: 192Language: Telugu
మనలోని అసలు రుగ్మతలేమిటి? దానికి మేలైన చికిత్స ఏమిటి అని తెలిపే వ్యాస సంకలనమే ఈ "జీవన మైత్రి". గురూజీ స్వామి మైత్రేయగారు వివిధ సందర్భాలలో ఇచ్చిన ప్రసంగాలు, సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వ్యాసాలు, శిష్యుల కోసం నిర్వహించిన శిక్షణా తరగతుల సారాంశమే ఈ వ్యాస సంకలనం. ఈ పుస్తకంలో గురూజీ స్వామి మైత్రేయ తాము గత ముప్పయైదేళ్ళుగా అనుభవ పూర్వకంగా తెలుసుకుని, విశదీకరించిన జీవన శైలి సారాంశం ఉంది. ఆ అనుభవ సారాన్ని మన రోజూవారీ జీవితంలోకి ఎలా అన్వయించుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోగలమో తెలియజెప్పే మార్గం ఉంది.
సమాజంలోని కృత్రిమత్వం, మనిషిలో పెరుగుతున్న అజ్ఞానం, అజాగరూకత, మూఢత్వం - వీటివలన మానవ సంబంధాలలో వస్తున్న అవాంఛనీయ మార్పులు, రోజు రోజుకు పెరుగుతున్న అనారోగ్యాలు, అశాంతి, మానసిక ఒత్తిడులు - వీటన్నిటినీ నివారించడానికి, నిర్మూలించడానికి, మనిషిని పరిపూర్ణ వ్యక్తిగా మార్చడానికి రూపొందించినదే ఈ జీవన మైత్రి.
- కే.వి. నరసింహాచార్య
