-
-
జీవన కెరటాలు
Jeevana Keratalu
Author: Kekalathuri Krishnaiah
Language: Telugu
రచయిత గురించి
రచయిత చిత్తూరు జిల్లాలో పాకాల మండలం, శంఖం పల్లె గ్రామంలో తేది 2-5-1938న శ్రీమతి నాగమ్మ, శ్రీ పాపయ్య అను దంపతులకు జన్మించారు. వీరికి రచయిత ఆఖరి ఎనిమిదో సంతానం. చిన్న తనం నుండి ఎన్నో కష్ట నష్టముల కొర్చి, వివిధ ప్రాంతాలు తిరిగి హైస్కూలు చదువు 1956 లో పూర్తి చేశాడు.
కుటుంబ పరిస్థితుల ప్రభావం వలన 1956 నుండి జీవిత మనుగడకు పోరాటం ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా, రుచించక హైదరాబాదులో ప్రైవేటు ఇంజనీరింగ్, నిర్మాణపనుల కంపెనీలో ఉద్యోగంలో చేరారు. సివిల్, ఎలక్ట్రిసిటీ, మెకానికల్ నిర్మాణపనులలో నిర్విరామ కృషితో, జ్ఞానాభివృద్ధి కాంచుతూ, దినదినాభివృద్ది చెందుతూ ఇంజనీరు స్థాయికి ఎదిగారు. దేశ విదేశాలలో 50 సంవత్సరంలు పైగా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు.
అదియును గాక ఉద్యోగ రిత్యా, విహార యాత్ర రిత్యా దుబాయ్, నేపాల్, యూరప్, శ్రీలంక, సింగపూర్ మరియు మలేషియా సందర్శించారు. చిన్నప్పటి నుండి క్రీడానుభవం కూడా మెండుగా ఉంది. ఈ విజ్ఞానానికి తన అనుభవ రంగం మేళవించి అక్షర రూపం దాల్చితే సమాజానికి ఉపయోగపడుతుందని రచనా వ్యాసంగము ఆరంభించారు. ఇది దైవ ప్రేరణగా భావించి ఈ క్రింది రచనలు చేశారు.
1. దేశ విదేశీ యాత్రా విశేషాలు.
2. భారతీయ యోగా సమ్మేళనం.
3. సత్సంగ సంకలనము.
పై రచనలు బాగా ఆదరించబడినవి.
ఎంచుకున్న రంగంలో ఎలాంటి ఫలాఫేక్షా లేకుండా కర్మయోగిలా పనిచేసుకుంటూపోవాలి. అప్పుడు పేరు తనంతట తానే వస్తుంది. కీర్తి నీడలాంటిది. అందుకుందామని వెంటపడితే పరుగుతీస్తుంది. పట్టించుకోకుండా మన పనివైపు మనం పయనిస్తుంటే అదే మన వెంట పడుతుంది.
ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఎన్నో ఆధునిక శాస్త్ర విజ్ఞాన ఫలాల వెనుక ఇలా కర్మ యోగుల్లా ఎందరో కృషి చేశారన్న విషయాన్ని మనం గుర్తించాలి. కేవలం తమను ఆ విధాత ఒక బాధ్యతను కొంగున కట్టి ఈ ప్రపంచానికి పరిచయం చేశాడని తెలుసుకున్నారు. ఆ మార్గంలో పయనించారు. జీవితాల్ని సార్ధకం చేసుకున్నారు. ఫలితం, పేరు ప్రఖ్యాతలు వాటంతట అవే వారికి ప్రసాదంలా లభించాయి.
పేరు ప్రఖ్యాతలపై ప్రీతిని అధిగమించి శ్రమించాలి. చాలా అజ్ఞాతంగా, ఆడంబరాలకు దూరంగా కృషిచేస్తూ ఉంటే మారుమూల పల్లెలో కూర్చున్నా ప్రపంచం మనసు అన్వేషించుకుంటూ వస్తూంది. కీర్తి కిరీటాలను వెంట తెస్తుంది. మనలో ఉన్న ప్రతిభ వెనుక ఒక మహాశక్తి పనిచేస్తుందనీ, మనం ఆశక్తికి వినయోగ పడుతున్న పరికరాలేనన్న భావన ఉన్నప్పుడే అజ్ఞాతంగా పని చేయగలం. అద్భుతాలను సాధించగలం.
సంకల్ప బలం ఉండాలి... సాహసం తోడుకావాలి. అంతులేని అన్వేషణ... విరామంలేని పరిశ్రమ కలగలిస్తే కలిసిగట్టుగా ప్రయాణిస్తే- విజయం పెంపుడు పావురం లాగా భుజంమీద వాలుతుంది.
1.ఐశ్వర్యం మన ప్రవర్తనను గమనించుకునే అవకాశం ఇవ్వదు. పేదరికంలోనే ఆత్మ పరిశీలన చేసుకునే సదవకాశం లభిస్తుంది.
2.కష్టాలు మనలోని అంతర్గత శక్తిని వ్యక్త పరిచేందుకు తోడ్పడేవే కానీ అపజయాలకు గురిచేసేవి కావు.
3.పేదరికం, శాపం కాదు, అది మన కార్యసిద్ధికి సహకరించే ఒక సాధనం.
4.కర్మయోగిలా జీవిత ఎత్తు పల్లాల మార్గంలో కొద్ది చదువుతో పల్లె నుండి బయలుదేరి అంతర్జాతీయ స్థాయి వ్యక్తులతో పనిచేసి జీవితాశయాలను నెరవేర్చుకున్న వ్యక్తి అనుభవసారం, సమాజమునకు పనికి వచ్చే విధంగా మలిచి వ్రాసిన పుస్తకమే ఇది!

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56