-
-
జీవన కాలమ్ - 2
Jeevana Kalam 2
Author: Gollapudi Maruthi Rao
Publisher: S.R. Book Links
Pages: 220Language: Telugu
ఆయన నటనలో సహజత్వం ఉంటుంది,
మాటలో భావ పరిపుష్టతతో కూడిన గాంభీర్యం ఉంటుంది,
రచనలో అనుకున్నదానిని-అనుభవసారాన్ని సరళంగా సూటిగా చెప్పే అసాధారణ శైలి ఉంటుంది.
ఆయన సినిమాల్లో ధరించిన పాత్రలు, రచనల్లో సృష్టించిన పాత్రలూ అన్నీ వైవిధ్యమైనవే!
నటన, ఉపన్యాసం, రచన ఇలా ఇన్ని కలగలిసిన ఆ గొప్పతనం పేరు..గొల్లపూడి మారుతీరావు.
50 ఏళ్ల క్రితమే మొదలైన ఆయన సాహితీ సేద్యం ఇప్పటికీ నాణ్యమైన, ఉపయోగకరమైన రచనల పంటను పండిస్తూనే ఉంది. అలా వచ్చిన ఎన్నో ఉత్తమ స్థాయి రచనల్లో...ఈ 'జీవన కాలమ్ - 2' సరికొత్తది.
ఇందులో ఉన్న వ్యాసాలన్నీ ఇటీవల సాక్షి మొదలగు పత్రికలలో ప్రచురితమైనవే!
దర్శక నిర్మాతలు రాజేంద్రప్రసాద్, కే. బాలచందర్, రామానాయుడు, రచయిత పాలగుమ్మి పద్మరాజు, కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్, గురువరేణ్యులు శివానందమూర్తి, టెన్నిస్ చాంపియన్స్ మారియా షరపోవా, మార్టినా హింగిస్ మరియు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులను గూర్చిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
ఎన్నో సంఘటనలు, మరెన్నో అనుభవాలు, ఎందరెందరో వ్యక్తులు, ఇలా 220 పేజీల నిండా ఉన్న విషయాలు చదువుతుంటే...మారుతీరావు గారు మనముందే కూర్చొని సంభాషిస్తున్నట్టుగా ఉంటుంది.
గమనిక: "జీవన కాలమ్ - 2" ఈబుక్ సైజు 16.6mb

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹72