-
-
జీవశాస్త్ర విజ్ఞానం - సమాజం
JeevaSastraVignanam Samajam
Author: Kodavatiganti Rohini Prasad
Publisher: Hyderabad Book Trust
Pages: 177Language: Telugu
Description
"అరచేతిలో సైన్స్... మన పాఠ్య పుస్తకాలు ఇలా ఉంటే ఎంత బావుండేదనిపిస్తుంది... విషయం ఏదైనా చందమామ కథంత సాఫీగా సాగిపోతుంది. "
- ఈనాడు
''(ఈ) పుస్తకం కేవలం తెలుగు రచనల పరిధిని పెంచడానికి కాక విద్యార్థులు వీటిని చదివి సైన్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రజలలో మూఢనమ్మకాల్ని తొలగించే హేతువాదాలకు, ప్రగతివాదాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది... సైన్స్‌లో లోతైన పరిజ్ఞానం లేనివారికి సైతం అరటిపండు ఒలిచిన చందంగా అవగాహన చేయించడం రచయిత రచనా కౌశలానికి నిదర్శనం. ఈ గ్రంథం చిన్నదిగా అనిపించినా దీని కోసం రచయిత పడిన శ్రమ, వెలువరించిన వ్యాసాల విలువ అమూల్యం.''
- స్వేచ్ఛాలోచన మాసపత్రిక
ఇందులో:
- జీవ పరిణామ సిద్ధాంతానికి ఆధునిక వివరణ
- మనుష్యులూ, ఇతర ప్రాణుల మనుగడకూ, ప్రవర్తనకూ జన్యుపరమైన ఆధారాలు
- ప్రాణుల చాపుపుటకల కీలకం, జన్యువుల స్వార్థ లక్షణాలు
- తక్కిన ప్రాణికోటిపై బ్యాక్టీరియా వైరస్ల ఆధిక్యత ఎటువంటిది?
ఇది:
- మనసుని కలవరపెట్టే అనేక మౌలిక సమస్యలకు సులువైన సమాధానం ఇస్తుంది.
- భౌతికవాదులూ, హేతువాదులూ అందరూ చదవదగ్గ విలువైన పుస్తకం.
- విద్యార్థులకూ, యువతీ యువకులకూ బహుమతిగా ఇవ్వదగ్గ సరళ రచన.
Preview download free pdf of this Telugu book is available at JeevaSastraVignanam Samajam
Login to add a comment
Subscribe to latest comments
