-
-
జీర్ణకోశ వ్యాధులు సులభ నివారణ
Jeernakosa Vyadhulu Sulabha Nivarana
Author: Dr. G.V.Purnachandu
Publisher: Sree Madhulatha Publications
Pages: 120Language: Telugu
ఆయుర్వేద శాస్త్ర విషయాల మీద ఇది నేను వెలువరిస్తున్న 19వ వైద్య గ్రంథం. ఇందులో తరచూ ఎదురయ్యే జీర్ణకోశ వ్యాధులు, వాటి లక్షణాలు, వాటి నివారణోపాయాలు, పథ్యాలు, అపథ్యాలు సాధ్యమైనంత సులువైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేశాను. సాధారణ వ్యాధుల విషయంలో ఇది కరదీపికగా వుంటుందని, ఉండలనీ నా ఆకాంక్ష.
జీర్ణకోశ వ్యాధుల్లో తరచూ మనకు ఎదురయ్యే వ్యాధి లక్షణాల గురించిన ఒక సమగ్ర అవగాహన కల్గించడమే ఈ పుస్తకం లక్ష్యం. అంతేకాదు, ఈ వ్యాధుల్ని అర్థం చేసుకొని, మనకుగా మనం నివారించుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏవి ఎందుకో సంపూర్తిగా విడమరిచి చెప్పడం జరిగింది. మరి అవసరం అయిన విషయాల్ని రెండు మూడు సార్లు పదే పదే చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే, దాన్ని చక్కగా అర్థం చేసుకోవడం కోసం.
దీర్ఘకాలం బాధించే అనేక వ్యాధులు మొదట జీర్ణకోశాన్ని బాధించే ఆ తర్వాత ఇతర వ్యాధులుగా మార్తున్నాయనీ, జీర్ణకోశ వ్యాధిగా వున్నప్పుడే భవిష్యత్తులో రాబోయే మరో పెద్ద వ్యాధికి హెచ్చరికగా తీసుకొని జాగ్రత్తప గలుగుతారని మనందరి మేలు కోసం జీర్ణకోశ వ్యాధుల్ని ఆయుర్వేద శాస్త్రం ఎంతో చక్కగా విడమరిచింది.
జీర్ణప్రక్రియ గురించి ఆయుర్వేదంలో చెప్పిన ఎన్నో రహస్యాల్ని ఈ గ్రంథంలో మీరు చదివి తేలికగా అర్థం చేసుకోవచ్చు.
వందలాది అద్భుత యోగాలు ప్రజల కోసం ఈ శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎవరికి వారు తమ కోసం తయారు చేసుకోగలిగే చిట్టి చిట్టి చిట్కాలుతో మొదలు పెట్టి తమ ఆరోగ్య పరిరక్షణ కోసం తాముగా చేయవలసిన ప్రతి విషయాన్నీ శాస్త్ర గ్రంథాల్లోంచి బైటకు తీసి అందించాలనే నా ప్రయత్నానికి ఇన్నాళ్ళు మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు నా నమస్కృతులు తెలుపుకొంటున్నాను.
- డా॥ జి. వి. పూర్ణచందు
