-
-
జయంతి అక్టోబర్ - డిసెంబర్ 2010
Jayanthi Oct Dec 2010
Author: Jayanthi Magazine
Publisher: Viswanatha Sahitya Peetham
Language: Telugu
సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్య పీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.
ఈ పత్రిక ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తోంది.
అక్టోబర్ - డిసెంబర్ 2010 సంచిక ప్రముఖ సాహితీవేత్త కోవెల సంపత్కుమారాచార్య స్మారక సంచికగా వెలువడింది. తెలుగులో ఆధునిక, ఉత్తమ కవితా ప్రమాణాలకోసం ఉద్యమించిన చేతనావర్తన కవులలో సంపత్కుమారాచార్య ప్రముఖులు. ఆగస్టు 2010లో స్వర్గస్తులైన సంపత్కుమారాచార్యకి ఎందరో కవులు, రచయితలు, ఆయన శిష్యులు ఈ సంచికలో అక్షరాంజలి ఘటించారు. కొందరు ఆయన కృషిని కొనియాడగా, కొందరు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొందరు ఆయన రచనలను మననం చేసుకుంటే, మరికొందరు ఆయన కవితల రూపంలోనివాళి అర్పించారు.
సంపత్కుమారాచార్య గారి అభిమానులే కాకుండా, తెలుగు సాహిత్యాభిమానులందరూ భద్రపరుచుకోవాల్సిన సంచిక ఇది. ఇక చదవండి.
