-
-
జయంతి ఏప్రిల్ - సెప్టెంబర్ 2007
Jayanthi April September 2007
Author: Jayanthi Magazine
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 147Language: Telugu
సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నడిపిన జయంతి పత్రికని ప్రస్తుతం విశ్వనాథ సాహిత్యపీఠం వారు పునరుద్ధరించి వెలువరిస్తున్నారు.
* * *
ఏప్రిల్ - సెప్టెంబర్ 2007 సంచిక శ్రీ జువ్వాడి గౌతమరావు గౌరవార్థ ప్రత్యేక సంచిక. ఈ సంచికలో గౌతమ రావు గారి గురించి ఎందరో ప్రముఖులు వెల్లడించిన అభిప్రాయాలు, రాసిన వ్యాసాలు ఉన్నాయి. విశ్వనాథ వారికి అత్యంత ఆత్మీయుడిగా, ఓ సామ్యవాదిగా, కవిగా, సంపాదకుడిగా, మంచి మనిషిగా గౌతమరావుగారితో తమకున్న అనుబంధాన్నిపాఠకులతో పంచుకున్నారు మరికొందరు.
జయంతి పత్రిక సంపాదకులు శ్రీ గౌతమరావుగారితో జరిపిన ఇంటర్వ్యూ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
ఇక చదవండి.
