-
-
జాతిపిత మహత్మాగాంధీ
Jatipita Mahatma Gandhi
Author: Victory Academic Unit
Publisher: Victory Publishers
Pages: 106Language: Telugu
"బయోగ్రఫీ సీరిస్" అనే శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు వెలువరిస్తున్న పుస్తకాల క్రమం లోనిది ఈ "జాతిపిత మహత్మాగాంధీ" అనే పుస్తకం. ఈ పుస్తకంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి జీవిత విశేషాలను సంగ్రహంగా వివరించారు.
* * *
దేశ స్వాతంత్య్రం కోసం, ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారతభూమిని విడుదల చేయటం కోసం ఎటువంటి హింసకు పాల్పడకుండా శాంతిమార్గంలో ఎంతటి మహత్తర కార్యాన్నైనా సాధింపవచ్చని నిరూపించిన ధీశాలి మహాత్మాగాంధీ. ఆయన చూపిన మార్గం కేవలం భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఒక వెలుగుబాటగా నిలిచిపోయింది. అందుకే ఆయన జీవితం అందరికీ ఆదర్శం. ఆయన మార్గం అనుసరణీయం. ఆయన కార్యశీలత ప్రశంసనీయంగా కీర్తింపబడుతున్నాయి. ఆయన తరతరాల భారత ఆధ్యాత్మిక వికాసానికి, శాంతి సౌభాగ్యాలతో కూడిన జీవన విధానానికి, ధర్మయుతమైన ప్రవర్తనకు ప్రతీకగా నిలిచిపోయినాడు. అటువంటి మహానుభావుని జీవితం గురించి తెలుసుకొనటం మనకు అత్యవసరం, ఆయన పయనించిన మార్గంలో ప్రయాణం చేయటం అనుసరణీయం. భారతదేశ శాంతి సహనశీలతలకు ఆయన చిహ్నం. ధర్మం కర్తవ్యనిష్టలకు ఆయన ప్రతీక.అందుకే ఈ చిన్న ప్రయత్నం.
- ప్రచురణకర్తలు

- ₹60
- ₹108
- ₹60
- ₹60
- ₹378
- ₹60