-
-
జాతకాలంకారము - రివైజ్డ్
Jatakalankaramu Revised
Author: M. Viswanatha Raju
Publisher: Sri Sai Vastu Publications
Pages: 57Language: Telugu
వేదాంగమైన జ్యోతిషశాస్త్రములో ఫలిత భాగమును తెలియజేయు గ్రంథములు వెలువడినవి. వాటిలో ప్రముఖమైన గ్రంథము జాతకాలంకారము. శుకమునిచే రచింపబడిన సర్వోత్కృష్ట సూత్రరూప గ్రంధము 'శుకజాతకము' నాధారము చేసికొని గణేశదైవజ్ఞు స్రగ్ధరావృతములో జాతకాలంకార గ్రంథమును రచించెను. ఇతడు తన గ్రంథములో తన వంశమును గూర్చి తెలియజేసెను. ఇతనితండ్రి శ్రీ గోపాలపండితుడు. ఇతడు ఛందోలంకార కావ్య నాటకవేత్తగా ప్రసిద్ధి పొందినాడు. గణేశ దైవజ్ఞుడు శివగురుని శిష్యుడు. ఈ గ్రంథాన్ని గురుప్రీతికై శక సంవత్సరము 1535 సం||ము భాద్రపదమాసంలో వ్రాసితినని తెల్పినాడు.
జాతకఫలితములను తెలియజేయుటలో ఇది అద్భుతమైన గ్రంథమని తెలుపవచ్చును. దీనిలో వ్యక్తి జాతకములోని ఫలిత విషయములను అద్భుతముగా వివరించెను. గ్రంథము చిన్నదైనను బిందువులో మహాసింధువును నిలిపినట్లుగా అన్ని ఫలితములు దీనిలో కూర్చబడినవి. గ్రంథకారుని రచనాశైలి అతిసుందరమేకాక సుబోధకమైనది.
దీనిలో సంజ్ఞాధ్యాయము, భావాధ్యాయము, యోగాధ్యాయము విషకన్యాధ్యాయము, ఆయుర్దాయాధ్యాయము, వ్యత్యస్థ భావఫలాధ్యాయము, వంశాధ్యాయమను భేదములతో ఏడు అధ్యాయములున్నవి. యోగాధ్యాయములో సామాన్య జనులలో కనిపించు లక్షణాలు మానసిక ప్రవర్తనలకు ప్రాధాన్యతనిచ్చి రచించెను. పన్నెండు భావముల ఫలితములనతి విపులముగా వివరించెను.
- డా. ముదుండి విశ్వనాథరాజు
