-
-
జాతక నారాయణీయం
Jataka Narayaneeyam
Author: Vadrevu Suryanarayana Murthy
Publisher: Self Published on Kinige
Pages: 306Language: Telugu
జాతక నారాయణీయము- వృద్దపారాశర్యమున దొమ్మిది గ్రహములే వ్రాసి వాటి మీద ఫలితమును జెప్పినారు, గాని యీమతములోని వాడే యగు గౌతముడు గౌతమసంహితయందు పారాశర్యములో జెప్పిన తొమ్మిది గ్రహములేకాక మరిమూడు గ్రహములు మాంది యనియును, గుళికుడనియును, ధూమ్రకుడనియును, వ్రాసి వాటిమీదగూడ ఫలితములను జెప్పినాడు. ఏ కారణములచేతనో జైమిని మొదలగు ఋషులును తరువాతవారును ధూమకుని మాత్రము వదలి తక్కిన పదకొండు గ్రహములమీదను ఫలితములను చెప్పిరి. తరువాత శ్రీపతి, సత్యాచార్య, వరాహ మిహిరులు ఏడు గ్రహములను మాత్రము తీసికొని ఛాయాగ్రహములను వదలివేసినారు. కాని వీరెందుచేతనో జైమిని సాంప్రదాయముల నొక్కటైనను తమబృహజ్జాతకాది గ్రంథముల యందుసూచించి యుండలేదు. వీరు అధ్యాయముల నేర్పరచుటలో గూడ పారాశర్యాది మతము ప్రకాశము తన్వాదిద్వాదశ భావములను గ్రమముగా జెప్పియుండలేదు. తరువాత బయలుదేటిన కాళిదాసాదులు వారి కాలము వరకును దేశమునందు బ్రఖ్యాతిగానున్న శ్రీపతి వరాహమిహిరాదుల మతము ననుసరించక తమ కేరళ ఉత్తర కాలామృతము మొదలగు గ్రంథములయందు పారాశర్యాది, ఋషుల మతమును దిరిగి యనుసరించినారు. కాళిదాసు కూడ మాందీ గుళికులను దీసికొని ధూమకుని వదలివేసినాడు. ఏకారణముచేతనో ఈయనగూడ జైమిని సాంప్రదాయముల నెత్తుకొనలేదు.
ఇటువంటి అనేక ప్రాచీన గ్రంథములు పరిశీలించి వాటిని సంగ్రహముగా అందరికీ అర్ధమయ్యే రీతిలో ఈ గ్రంథములో రచయత పొందుపరిచారు
