-
-
జంధ్యామారుతం
Jandhyamarutham
Author: Pulagam Chinnarayana
Publisher: Hasam Prachuranalu
Pages: 195Language: Telugu
జంధ్యామారుతం-1, 2 భాగాలను దరిమిలా అందుబాటులోకి వచ్చిన కొత్త విశేషాలతో విస్తృతపరచి కలిపి, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందంల ముందుమాటతో... ఒకే సంపుటంగా వెలువరిస్తున్న నూతన ప్రచురణ ఇది.
* * *
"పెన్"టాస్టిక్గా రాసి, "ఫన్"టాస్టిక్గా తీసి, తెలుగు చిత్రరంగంలో చిరకీర్తి నార్జించిన జంధ్యాలకు, రచనాపరంగా, సంగీతపరంగా, దృశ్యపరంగా ఆయన సాధించిన విజయాలకు నిలువెత్తు నివాళి ఈ పుస్తకం.
జంధ్యాల దర్శకత్వం వహించిన 39 సినిమాల చిత్రకథ, నటీనటుల పూర్వాపరాలు, నిర్మాణంలో తమాషాలు, షూటింగ్ విశేషాలు, మెచ్చుతునకలైన డైలాగ్స్, పాటల పల్లవులు, స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్, చిత్ర జయపజాయల సమీక్ష....
ఇలా ఒక్కో సినిమా గురించి విశ్లేషిస్తూ జంధ్యాల దర్శకత్వ ప్రతిభను సంపూర్ణంగా ఆవిష్కరించిన ఈ పుస్తకం - తెలుగు పుస్తక రంగంలోనే ప్రప్రథమ ప్రయోగం!
* * *
"తెలుగు సినిమాలలో హాస్యం ఉన్నంతవరకు జంధ్యాల చిరంజీవే"
- వరప్రసాద్, ప్రచురణకర్త
