-
-
జానకితో జనాంతికం - స్వీయచరిత్ర
Janaki to Janantikam Sweeya Charitra
Author: Duvvuri Venkataramana Sastry
Publisher: Rajachandra Foundation
Pages: 132Language: Telugu
మా ఫౌండేషన్ నాలుగవ ముద్రణగా కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర, వారు ఆలిండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం 'జానకితో జనాంతికం' కలిపి ప్రచురిస్తున్నాము. సర్వం తానే అయి వుండి వ్యాపించి వున్న స్వామి పాదాల వద్ద అమ్మవారు కూచుని అంతటా వున్న ఆయన వద్ద జనాంతికం ఎలా అన్నట్టు చిన్న నవ్వు నవ్వుతున్న బొమ్మ బాపుగారికెంత యిష్టమో - అంతే మురిపెంతో మేము ఈ చిత్రాన్ని ముఖచిత్రంగా ప్రచురించుకుంటున్నాము.
- ప్రచురణకర్తలు
* * *
దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి జీవితచరిత్ర చదివిన వారందరికీ కూడా జీవితాన్ని ఎంత సౌందర్యవంతంగా మలుచుకోవచ్చో తెలుస్తుంది! మనకున్న వాక్చమత్కృతితో-చాతుర్యంతో ఇతరులకు హాని కలిగించకుండా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించవచ్చో నేర్పుతుంది. ముఖ్యంగా ఆ కాలం నాటి వారి విద్యావ్యాసంగం, వారు నిలబెట్టుకున్న విలువలు, వారి జీవితంలోని ప్రాథమ్యాలు, నేటితరం వారికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది!
- డాక్టర్ ధూళిపాళ అన్నపూర్ణ
