• Jammi Pulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జమ్మిపూలు

    Jammi Pulu

    Author:

    Pages: 155
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి తెలంగాణా కథలు. తెలంగాణ ప్రాంతపు కథలు. తెలంగాణా తెలుగు మాండలికాలు, యాసా నోటినిండా పలికిన కథలు. అక్కడి తండావాసుల వ్యవహార పదాలు, యాసలు కథల్లో సంభాషణలనిండా ఉన్నాయి.

ఇందులో ఉన్న పదిహేను కథల్లో పన్నెండు కథలు కేవలం గిరిజన తండాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని జీవితాల కథలు. నిత్యము వారితో కలిసిమెలిసి వారి కష్టసుఖాలల్లో భాగమై, వారి మనసులోని మర్మములు ఎరిగిన కథలివి. ఇందులోని ప్రతీ కథ ఒక్కొక్క ఆడకూతురి మనసులోని ఆవేదనను, ఒక పిల్లవాడు లేదా పిల్లదాని గుండెలలో దాగిన బాధ వెనుక వున్న నిజమయిన జీవితాలగురించి చెప్పిన కథలు. ప్రతీ కథా మాములు కథల వెనుక ఉన్న అసలు కథను చెప్తుంది. అదే ఉమాదేవి ప్రత్యేకత

- వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

అన్ని కథలూ కంచికి చేరవు. కొన్ని గుండెను తాకి పట్టేసి వదలవు. ఊపిరాడనట్టు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సమ్మెట ఉమాదేవి 'జమ్మిపూలు' కథలు అలాంటివే! 'కాళ్ళు తడవకుండా నదినీ, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం' అని ఎవరో కవి అన్నట్లు.. ఇవి కొన్ని జీవితాలను అద్దంలా మన ముందుంచిన అర్హత నిండిన కథలు.

అరుదైన వృక్ష జాతులు, పక్షి జాతులు అంతరించి పోతున్నాయనీ, వాటిని కాపాడుకోవాల్సిన ఆగత్యం ఉందని శాస్త్రవేత్తలు, సామాజిక సేవకులూ గగ్గోలు పెడుతున్న వేళ 'జమ్మిపూల' లాంటి మట్టి మనుషుల్లోని స్వచ్ఛత, అనురాగమూ వసి వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సాటి మనుషులమైన మనందరి పైనా ఉందనేది సత్యం. ఈ పుస్తకంలోని ప్రతి కథా అడవి పూలలాంటి స్వచ్ఛత, సరళత, పరిమళం కల్గి ఉన్నాయి. మట్టి మనుషుల జీవితాల్లోని దాపరికం లేని మనస్తత్వాలని మనముందు పరిచి కళ్ళను తడి చేస్తాయి.

- నెల్లుట్ల రమాదేవి

Preview download free pdf of this Telugu book is available at Jammi Pulu