• Jalapatam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • జలపాతం

  Jalapatam

  Author:

  Pages: 374
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

అక్కడ ఉన్న అమ్మాయిని చూస్తునే చిరునవ్వుతో, "యాడ్ ఇవ్వాలి!" అన్నాడు అమరేంద్ర.

నవ్వీనవ్వనట్లుగా లేత ఎరుపురంగు పెదవులను కొద్దిగా వెడల్పు చేసింది ఆ అమ్మాయి. "ప్లీజ్!" అన్నది ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ.

గోధుమ రంగు చుడీదారులో, పచ్చటి మొహంతో, విశాలమైన నేత్రాలతో పదేపదే చూడాలనిపించేలా ఉన్నదా అమ్మాయి. ఒత్తయిన జుట్టు... నిలువు బొట్టు... కళ్ళు మరింత పెద్దవయ్యేలా కాటుక... తలంటి పోసుకున్నదేమో ఫాను గాలికి రాగి రంగులో ఉన్న జుట్టు ఆకర్షణీయంగా కనబడుతున్నది.

మడతపెట్టి ఇచ్చిన కాగితాన్ని తీసుకుని ఒక్కసారి అమరేంద్ర ముఖంలోకి చూసి మడత విప్పింది.

'అందమైన చదువుకున్న అమ్మాయి, హైదరాబాద్‌లోని వ్యాపారవేత్తకు మూడు నెలలు భార్యగా కావలెను. కుల మత పట్టింపులు లేవు. వయస్సు ఇరవై దాటకుండా ఉండవలెను. ఆసక్తిగలవారు వివరములతో ఫోటోను, జాతకాన్ని జతచేసి వెంటనే పోస్ట్‌బాక్స్ నం... కు పంపండి!'

"బాక్స్ నంబరు మీరు ఇస్తారుగదా!" అన్నాడు ఆ అమ్మాయినే చూస్తూ.

ఆమె పెదవులు నవ్వుతున్నట్లుగా ఇంకా విచ్చుకునే ఉన్నాయి. కొన్ని క్షణాలు వింతగా అందంగా, హుందాగా ఉన్న అమరేంద్ర వంక కన్నార్పకుండా చూసింది.

"మూడు నెలలు భార్య కావాలనుకోవడం చట్టబద్ధం కాదనుకుంటాను. మా లీగల్ సెల్ క్లియరెన్స్ ఇస్తేనేగానీ మేం ఈ యాడ్‍ను అంగీకరించకపోవచ్చు!"

అతడు ఉలిక్కిపడ్డట్టుగా ఆమె వంక చూశాడు.

Preview download free pdf of this Telugu book is available at Jalapatam