-
-
జాజిమల్లి బ్లాగ్ కథలు
Jajimalli Blog Kathalu
Author: Dr. Malleeswari
Publisher: Perspectives
Language: Telugu
తన భావోద్వేగాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, జ్ఞాపకాలను పంచుకోడాన్కి మల్లీశ్వరికి ఒక కొత్త స్నేహప్రపంచాన్ని పరిచయం చేసింది జాజిమల్లి.
ఏ నియంత్రణలూ, ఆంక్ష్లలూ లేని బ్లాగ్ అక్షర ప్రపంచంలో ఆమె సంపూర్ణ స్వేచ్ఛని అనుభవించింది. ఈ ప్రయాణంలో తన అభిప్రాయలు సవరించుకుంది. తన ఆలోచలని విస్తరించుకుంది. కాలక్రమంలో జాజిమల్లి కథల్ని పరిశీలిస్తే ఈ పరిణామం స్పష్టమవుతుంది. జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ ఆ వెలుగులో తన బాల్యాన్ని విశ్లేషిస్తూ రాసిన ఈ కథలు మన చిన్ననాటి జ్ఞాపకాలను తట్టి లేపడం, బాల్యంలోకి మనల్ని ప్రవహింపజేయడం ఖాయం.
మానవ సంబంధాలలోని సున్నితత్వాన్ని, కుటుంబ సంబంధాలలోని సంక్లిష్టతని స్త్రీ కోణం నుంచి కథలుగా చెప్పింది మల్లీశ్వరి. ప్రపంచాన్ని ముఖ్యంగా స్త్రీల జీవితాన్ని... సామాజిక రాజకీయ, ఆర్థిక దృక్కోణంలో వ్యాఖ్యానించింది. తన రచనా విధానంలో ఉన్న సరళత, చదివించే గుణం, కవితాధోరణి వెంటవెంటనే చదివేయాలని తొందర పెట్టినా ప్రతీ కథా ముగింపులో వేసే ప్రశ్న, కొసమెరుపు మనల్ని ఆపి నిలేసి ఆలోచింపజేస్తాయి.
స్త్రీల జీవితాల చుట్టూ ఆవరించి ఉన్న పితృస్వామిక తెరలను సమకాలీన రాజకీయ సమస్యలను అర్థం చేసుకున్న తీరు ఈ కథల్లో కనిపిస్తుంది. అస్తిత్వ ఉద్యమాలు లేవనెత్తుతున్న ప్రశ్నలను ఈ మెరుపు కథలు తడమడమే కాక సంఘీభావాన్ని ప్రకటించాయి. క్లుప్తత సూటిదనం స్పష్టత ఈ కథల ప్రత్యేకత.
- విష్ణుప్రియ
తిరుపతి
ఈ పుస్తకం గురించి 19 డిసెంబరు 2011 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక "వివిధ" పేజిలో పరిచయ వ్యాసం ప్రచురితమైంది. ఈ క్రింది లింక్లో వ్యాసాన్ని చదవచ్చు.