-
-
జైత్రయాత్ర
Jaitra Yatra
Author: Varavara Rao
Publisher: Perspectives
Pages: 297Language: Telugu
పాలకుల రాజ్యహింస కారణంగా మనిషి లోపల బయట జరిగే విధ్వంసం నుంచి వేలతల్లి బిడ్డలను కాపాడుకోవటానికి కాలంతో నడిచిన రచయిత అల్లం రాజయ్య. కల్లోల దశాబ్దాల్లో (1971-2000) నిర్మాణ మౌతున్న ప్రజల పోరాట చరిత్రని రాజయ్య సాహిత్యం నమోదు చేసింది. భూ నిర్వాసితత్వాన్ని ప్రశ్నించి తిరగబడ్డ 'సృష్టికర్తలు, అతని సాహిత్యంలోని పాత్రలు. కొనసాగుతున్న ప్రజాయుద్ధానికి సాంస్కృతిక ప్రతిఫలానాలే రాజయ్య సృజనాత్మక రచనలు. వరవరరావు రాజయ్యలు కల్లోల నక్సల్బరీ దశాబ్దాల జైత్రయాత్రకు ప్రత్యక్ష సాక్షులు, రాజయ్య రచనల నేపథ్యంలోని సాంస్కృతిక రాజకీయ చరిత్రని అనితర సాధ్యంగా విశ్లేషించారు. వరవరరావు, రాజయ్య సాహిత్యానికి వరవరరావు ముందుమాటలు ఒక సూక్ష్మదర్శిని, ఒక దూరదర్శిని.
ప్రజా రాజకీయ సామాజిక ఉద్యమాలే తన కార్యక్షేత్రంగా జీవిస్తూ, పోరాడుతున్న మేధావీ రచయిత వరవరరావు. సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన వరవరరావు 25 కుట్రకేసుల నుంచి నిర్దోషిగా విడుదలై, 'భీమా కోరేగావ్ ' కుట్రకేసులో సహ నిందితుడిగా మహారాష్ట్ర జైళ్లలో గత రెండేళ్లుగా నిర్బంధంలో ఉన్నారు.
వరవరరావు రాజయ్యలు ఇద్దరూ విరసం సభ్యులు. రాజయ్య సృజనాత్మక సాహిత్యంపై వరవరరావు గతితార్కిక విశ్లేతో ఈ.. జైత్రయాత్ర
- ఆర్ కె
పర్స్పెక్టివ్స్
గమనిక: "జైత్రయాత్ర" ఈబుక్ సైజు 9mb
