-
-
జైమిని సూత్రార్థ దీపిక
Jaimini Sutrartha Deepika
Author: Bhamidipati Ananta Sarma
Publisher: Mohan Publications
Pages: 360Language: Telugu
జైమిని జ్యోతిష్యం ప్రాచీన జ్యోతిష శాఖలలో విభిన్నమైనది మరియు కొంత శ్రమతో కూడుకొని వున్నది. అంటే ఫలితాలు నిర్ణయించడానికి కొంత విభిన్నమైన పంథాలో సాగుతుంది ఈ శాస్త్రం. జైమిని మహర్షి తనకు ఉపదేశం ఇవ్వబడిన జ్ఞానాన్ని ఈ శాస్త్ర రూపంలో అందించారు.
జైమిని మహర్షి రచించిన ఈ శాస్త్రానికి లగ్న, కారకాంశ, ఆరూఢపద, మరియు విభిన్న దశలు అనేవి నాలుగు మూల స్తంభాల వంటివి. జైమిని మహర్షి మొదటి అధ్యాయం - నాలుగు పాదములలో ప్రాథమిక విషయాలైన రాశి దృష్టి, అర్గళ, ఆరూఢ సాధన మొదలైనవి కారకాంశ, ఆరూఢ, ఉపపద విషయాలు, ద్వితీయ అధ్యాయములో ఆయుర్దాయ, దశా బేధాలు వివరించారు.
సూత్రశైలిలో వ్రాయబడ్డ ఈ జైమిని సూత్రము అనే గ్రంథానికి గత శతాబ్దాలలో అనేకమైన సంస్కృత వ్యాఖ్యాన గ్రంథాలు వచ్చినా, ఉదాహరణ రీత్యా సూత్రాలను వివరించి సమన్వయము చేసిన గ్రంథాలు చాలా అరుదు. ఉన్న కొన్ని పుస్తకాలు కూడా ఏదైనా దశను వివరించేవే కాని మొత్తం శాస్త్రాన్ని కూలంకషంగా చర్చించిన గ్రంథాలు చాలా తక్కువ. ఆ కొరతను తీర్చి జైమిని నేర్చుకునే విద్యార్థులకు కరదీపికగా శ్రీ శర్మగారు ఈ గ్రంథ రచన చేసారు.
- షణ్ముఖ

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE