-
-
జాగ్వార్ జస్వంత్
Jaguar Jaswanth
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 100Language: Telugu
" తాతగారు ఎప్పుడు వస్తారు తారా ? ఫిరంగులు అలా మోగుతున్నాయెందుకు ? " పట్టి పట్టి అడుగుతున్న జస్వంత్ ప్రశ్నలకు సమాధానం యివ్వలేక సతమతమైపోతున్నది తార.
యుద్ధం ఘోరరూపం ధరించిందని తెలిసింది. రాజమందిర ప్రాంగణంలో కూడా అడుగుపెడుతున్నారు శత్రుసైనికులు. వారిలో కొంతమంది బ్రిటీష్ జాతీయులు ఉండటం గమనించి తార భయాందోళనకు గురి అయింది.
రాణా నుంచి గాని, మహారాజు వద్ద నుంచి గాని సమాచారం రాలేదు. తను ఏం చేయాలో తెలియక భయపడి పోతున్నదామె.
భవన ప్రాంగణాన్ని ముట్టడించిన శత్రువులను ఊచకోత కోస్తూ లోనికి పరిగెత్తుకొచ్చాడు రాణా సోదరుడు.
" తారా దేవీ యువరాజుతో చంద్రికా నదీ తీరానికి తరలిపొమ్మని రాణా ఆజ్ఞ " అన్నాడు రహస్య ద్వారాన్ని తెరుస్తూ.
మహారాజు ఆజ్ఞ అనకుండా రాణా ఆజ్ఞ అన్నందుకు అదిరిపడి ప్రశ్నార్ధకంగా చూసింది తార. ఆమె కనులలోకి చూసి మౌనంగా తల ఆడించాడు చిన్న రాణా. మహారాజు మరిలేడని గ్రహించి వస్తున్న దుఃఖాన్ని అతిప్రయత్నం మీద బిగపట్టుకున్నది తారా. యువరాజు చూస్తే మరింత గొడవ చేస్తాడని బలవంతంగా నవ్వుతూ, మరో నలుగురు దాసీలతో సొరంగంలోకి అడుగుపెట్టింది.
మార్గం మూసి వెనుతిరిగాడు చిన రాణా. అదే సమయంలో వెల్లువలా వచ్చి భవనాన్ని ఆక్రమించుకున్నారు చంచల్ ఘడ్ సైనికులు.
" మార్ డాలో ... యువరాజును వెతికి చంపండి, " అని కేకలు వినవస్తున్నాయి. శయన మందిర ద్వారం మూసి అడ్డు నిలబడ్డాడు చిన రాణా.
లోనికి వచ్చిన సైనికుణ్ని వచ్చినట్లే తన కత్తికి ఎర చేయసాగాడు. అయినా వెనుతీయకుండా గుంపులు కట్టి అతన్ని చుట్టుముట్టారు శత్రువులు.
సొరంగమార్గం గుండా నదీతీరానికి పావుఘడియ ప్రయాణం. ఆ పావుఘడియ గడిచిపోయేవరకూ గాయాలు తగిలి శక్తి దిగజారిపోతున్నా లెక్కచేయకుండా అడ్డునిలిచి శత్రువులకు ఎదురు తిరిగాడు చిన రాణా. క్రమంగా అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసి బరిశెలతో తూట్లు పొడిచారు శత్రువులు. కింద వాలిపోతూ యువరాజు నదీతీరాన్ని చేరుకుని వుంటాడన్న తృప్తితో కనుమూశాడా వీర యువకుడు.
Maa Oorilo 'RAJA' Book Stall Undedi. Madhu Babu Gari Books kosam gumpuluga vache jananni chusi, aascharyam kaligedi. Madhu Babu Gari Novels rentki vellayani thelisi, Aa navala kapeelu konukkuni vellevaru. Idi maree adbhutam! That is MADHU BABU! Yeppatikee Madhu Babu garu Number One Writer.
'Jagwar Jaswanth' simply superb Novel.
I saw MADHU BABU decades in my school days. Hundreds of books are hanging in Book Stalls. Some people are purchasing immediately. That is the Power of MADHU BABU.
'Jagwar Jaswanth' Novel is very interesting and full pack with Action.