-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
జగన్నాటకం (free)
Jagannatakam - free
Author: K. Seshaiah
Publisher: Self Published on Kinige
Pages: 112Language: Telugu
ఆచార్య శేషయ్య తన ‘జగన్నాటకం' కథను సెమీ నవలగా, రాజ్యాంగం డాక్యుమెంటరీగా తీర్చిదిద్దడం ఒక ఉన్నత లక్ష్యంవైపు చేసిన ప్రయాణం అని తోస్తున్నది. సమన్యాయం అందించడానికి ఇందులో ప్రజాస్వామ్య వ్యక్తిగత విలువలు ముఖ్యంగా రక్షణ కృతజ్ఞతల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. పైపెచ్చు సకల జనులు సుభిక్షంగా ఉండడానికి న్యాయమార్గానికి పెద్దపీటవేయడం, శంకరాచార్యుల పంచాయతనం, రాజకీయ హక్కులను విధులతో జోడించడం ఆలోచించవలసిన విషయమే.
ఈ దేశం, ప్రపంచ సాంకేతిక విజ్ఞాన పెను తుఫానులో కొట్టుమిట్టాడుతుంటే దానికి ధీటైన ఆధ్యాత్మిక మానసిక సామాజిక రాజకీయ రంగంలో కావలసిన మార్పులకు నాంది ప్రస్తావన జరపవలసిన అవసరాన్ని దృశ్యకావ్యంగా మలచ బడింది. క్రొత్తకు వింత, పాతకు రోత అన్న నానుడిని అనుసరించకపోయిన యెడల ఆదిమానవుడు, స్పూత్నినిక్ రోబాటిక్ మానవుడై ఉండేవాడు కాదు కదా! కాబట్టి రాజ్యాంగం రూపుకు, మెరుగులు దిద్ది నాజూకు నొక్కులతో అలంకరించాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను.
- డా. కిలపర్తి జగ్గారావు
