-
-
జడ పజ్యాలు
Jada Pajyalu
Author: Multiple Authors
Publisher: Akshagna Publications
Pages: 36Language: Telugu
Description
జడ పొడుగ్గా ఉండడం... ఒకప్పటి అందం....
కత్తిరించుకోవడం నేటి షోకు...
జడ తలచుకోగానే సత్యభామ గుర్తొస్తుంది!
జడతో కృష్ణుణ్ణి.. సుతారంగా రెండు తగిలించడం,
ఎంత నాజూకు శృంగారవండీ...!!
పూర్వం రెండు జళ్ళుండేవి... వాలు జడలుండేవి... పూలజడలుండేవి...
ఇక జడలల్లిన 'బ్నిం' గురించి!.. బ్నిం కన్ను దేనిమీదన్నా పడితే అది
బొమ్మైనా అవుతుంది... పద్యమైనా అవుతుంది...
ఇంత క్రితం చీరపద్యాలు రాశాడు... తెలుగుతనం కుచ్చిళ్ళు పెట్టింది!
ఇప్పుడీ జడ కందాలు... వాటి అందాలు... చందాలు... విందులు
ఆడపిల్ల అందంగా ఉండడమే కాదు...
ఆ అందాన్ని అందంగా చూడడం కూడా రావాలి... అది బ్నిం కొచ్చు...
ఈ పద్యాలన్నీ బాపూరమణల పాదాల మీద పారిజాతాల్లా పోసిన
వారంతా ధన్యులు....
ఓ వీరాభిమాని
ఓ చీరాభిమాని
ఓ జడాభిమాని
ఓ బ్నిమ్మాభిమాని
- తనికెళ్ళ భరణి
Preview download free pdf of this Telugu book is available at Jada Pajyalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE