-
-
జాత్యాహంకారి హిట్లర్
Jaatyaahankaari Hitler
Author: Ramadevi Cheluru
Language: Telugu
జాత్యాహంకారి హిట్లర్
రమాదేవి చేలూరు
హిట్లర్ ఆవిర్భావానికి, హిట్లర్ పట్ల జర్మన్ జాతిలోనయినా ఆదరణ రావడానికి, రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో జర్మన్ జాతి రక్షకుడిగా హిట్లర్ తలెత్తడానికి కారణాలేమిటో అర్థం చేసుకోవలసి ఉంది. ఒక రకంగా ప్రపంచం మళ్ళీ రెండు యుద్ధ మధ్యకాలం నాటి జీవితాన్నే, 1929 మహసంక్షోభానంతర కాలన్నే పునరుజ్జీవిస్తున్నప్పుడు హిట్లర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. హిట్లర్ నాజీ పాలన దేశంలో యూదుల మీద, కమ్యూనిస్టుల మీద, ప్రజాస్వామ్యం మీద పరమ భయంకరమైన మారణకాండను రుద్దుతుంటే ప్రపంచం మౌనంగా ఎందుకు ఉండిపోయిందో అధ్యయనం చేయవలసే ఉంది. యుద్ధాన్ని ప్రారంభించి, యూరప్‌లో ఒక్కో దేశాన్నే కబళిస్తూ, వేలాదిమంద్ని నరమేధం సాగిస్తూ హిట్లర్ ముందుకు కదులుతుంటే, శక్తిమంతంగా అడ్డుకోలేకపోయిన బూర్జువా ప్రజాస్వామిక రాజ్యాల అసలు రంగును కూడా విశ్లేషించుకోవలసి ఉంది.
రచయిత రమాదేవి చేలూరు తెలుగు సాహిత్యంలో పట్టభద్రురాలు. అమెరికన్ నల్లజాతి మహిళ సొజర్నర్ ట్రుత్ జీవితం పుస్తకాన్ని ’ స్వేచ్ఛాగానం’ పేరుతో తెలుగులో ప్రచురించారు.
Well description.
I could read entire book within two sittings only