-
-
ఇతి స్మరణీయం అతి రమణీయం - రివైజ్డ్
Iti Smaraneeyam Ati Ramaneeyam Revised
Author: Neelamraju Lakshmi Prasad
Pages: 118Language: Telugu
'అరుణాచల ప్రశస్తి'తో ప్రారంభమై, 'అమరవాణి' అనే వ్యాసంతో ఈ పుస్తకం ముగుస్తుంది. ఇందులో 38 వ్యాసాలు ఉన్నాయి. పుస్తకం పేరు వినగానే రమణమహర్షిపై సాగిన రచనగా ప్రతివారూ గుర్తిస్తారు. అలాగే లక్ష్మీప్రసాద్ పేరు వినని వారు ఉండరు. ముఖ్యంగా తాత్విక రచనలు చదివే వారు. రచయిత నాటి నవోదయ, ఆనందవాణి నుంచి నేటి ప్రముఖ పత్రికల దాకా తమ రచనలను అందిస్తూనే ఉన్నారు.
తాత్విక చింతనకు పత్రికాశైలిని జోడించి వారు ఒక కొత్త ఒరవడిని సృష్టించుకున్నారు. గహనమైన అంశాలను ముందు తను జీర్ణించుకొని, దానిని సరళతరం చేయడం ఒక ప్రతేక విద్య. అలాంటి విద్యలో ఆరితేరిన వారు లక్ష్మీప్రసాద్. ఇందులో చిట్ట చివరిగా ‘మరణమే శరణం' అనే చిన్న నాటకం కూడా ఉంది. మౌంటెన్పాత్ పత్రికలో శారద రాసిన ‘ది ఆప్షన్’ అనే ఆంగ్ల వాటకాన్ని చక్కని తెలుగులోకి ఈ రచయిత అనువదించారు. పేరుకు తగినట్లు ఈ పుస్తకం స్మరణీయం, రమణీయం.
- ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162