-
-
ఇరవై ఆరు గంటలు
Iravai Aru Gantalu
Author: P. S. Narayana
Pages: 215Language: Telugu
ఓ రోజు సాయంత్రం ఇనిస్టిట్యూట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, "నాకు నచ్చిన మనిషి దొరికితే నాతో పాటు అమెరికా తీసుకువెళ్ళి, రెండేళ్ళు అక్కడ వుండివచ్చి - హైదరాబాద్లో నా కలలను పండించుకోవాలని అనుకుంటున్నాను!" అన్నది ఓరగా ఆదిత్య ముఖంలోకి చూస్తూ
"మంచి ఆలోచనే!" అన్నాడు ముభావంగా ఆదిత్య.
తరువాత ఆ విషయం చాలా చిన్న విషయం అన్నట్లుగా మరో విషయంలోకి మాట మార్చింది సౌజన్య కాని అదే తరువాత అతడి మనస్సుని ఓ పురుగులా తొలిచేస్తూ అతడిని రాత్రిళ్ళు నిద్రపోనీయకుండా చేస్తుందని ఆమెకు తెలియదు!
తనే సౌజన్యకు నచ్చిన మనిషి ఎందుకు కాగూడదు - అనుకున్నాదు ఆదిత్య!
అలా అవ్వాలీ అంటే - ?"
అది తన చేతిలో పనే! తన తెలివితేటలను ఇప్పుడే చూపించాలి. ఆకాశంలోకెగిరి కోరికలు తీర్చుకునేటందుకు ఓ మనిషి చేయూతనివ్వటానికి తయారుగా వున్నప్పుడు - ముడుచుకు కూర్చోవటంలో అర్థం లేదు.
తను చొరవ తీసుకొని ఏదో ఒకటి చేసేయాలి!
