-
-
ఇంట్లో ప్రేమ్చంద్
Intlo Premchand
Author: Sivarani Devi Premchand
Publisher: Hyderabad Book Trust
Pages: 282Language: Telugu
అన్ని మానవ సంబంధాల్లోకి భార్యాభర్తల అనుబంధం అతి సన్నిహితమినదీ, ఎక్కువ కాలం కొనసాగేదీ అనాలి. భర్త చనిపోయాక భార్య ఆయనతో తను పంచుకున్న జీవితం గురించి నిజాయితీగా రాయటమనేది భారతీయ సాహిత్యంలో చాలా అరుదుగా కనిపించే అంశం. ఈ పుస్తకంలో శివరాణీ దేవి ఆ పనీ చేసి చూపారు. సంభాషణల ద్వారానూ, అక్కడక్కడా స్వగతంలాగాను ఆమె రాసిన విషయాలవల్ల ప్రేమ్చంద్ తాలుకు గొప్పదనమే కాక, ఆమె గొప్పదనమూ, ప్రేమ్చంద్ని ఒక్కోసారి ముందుండి నడిపించిన ఆమె తెలివితేటలూ, ధైర్యమూ అనుకోకుండానే ఈ పుస్తకంలో మనకి కనిపిస్తాయి. ప్రేమ్చంద్ గురించి తెలియని తెలుగు పాఠకులు అరుదు. ఈ పుస్తకాన్ని ఆయన వ్యక్తిగా ఎటువంటివారో తెలుసుకునేందుకు, ఇంకా ముఖ్యంగా ఆయన భార్య శివరాణీ దేవిలో ఎంత ప్రతిభ ఉందో తెలుసుకునేందుకు అందరూ తప్పక చదవాలి.
* * *
"ఆయన మనసులో స్త్రీలపట్ల గౌరవభావం ఉంది. స్త్రీలు పురుషులకన్నా గొప్పవాళ్లని ఆయన నమ్మకం. నేను ఎప్పుడైనా అరుబైట కూర్చోవాలనిపించి,బైటకొచ్చి నిలబడేదాన్ని. ఆయన వెంటనే లేచి వెళ్ళి గబగబా నా కోసం కుర్చీ తెచ్చి వేసేవారు.... నా కంచం పక్కన కూడ నీళ్ళ గ్లాసు ఉంఛేవారు.... నేనొక్కదాన్ని కూర్చుని వంట చేస్తూండటం కనపడితే చాలు, పక్కనే పీట వేసుకుని వంటయ్యేదాక వంటింట్లోనే కూర్చునేవారు. చదువుకునేందుకు నాకేమైనా ఇచ్చాకనే తను రాసుకోవటానికి కూర్చునేవారు. నేనెక్కిడైనా వెళ్ళాలంటే, అంత దూరం నా వెంట వచ్చి దింపి వెనక్కి వెళ్ళేవారు."
- శివరాణీ దేవి ప్రేమ్చంద్
"ముసలి ఆవుని ముస్లిములు బలి ఇచ్చినప్పుడు రెండు పక్షాల వాళ్ళూ కొట్టుకుచస్తారు. కానీ అదే ఇంగ్లీషువాళ్ళు వందలకొద్దీ ఆవులనీ, దూడలనీ చంపినప్పుడు హిందువుల రక్తం కోపంతో మరిగిపోదేం? నువ్వే చెప్పు, మేకలని బలివ్వని దేవత గుడి ఉందా మన దేశంలో?.. ఏ మతమూ పూర్తిగా మంచిదీ కాదూ, చెడ్డదీ కాదు. ఆవు కోసం ప్రాణాలు ఇవ్వటానికి వెనుకాడని ఆ హిందువులే తల్లిదండ్రులకి ఒక ముద్ద అన్నం పెట్టలేరు...."
- ప్రేమ్చంద్
