• Intinti Vaidyam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంటింటి వైద్యం

    Intinti Vaidyam

    Publisher: Vignana Vedika

    Pages: 252
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లోగడ "ఇంటింటి వైద్యం" శీర్షికన "ఆంధ్రజ్యోతి" వారి "నవ్య" వీక్లీలో ఇరవై అయిదు వారాల పాటు ధారావాహికంగా ప్రచురించబడి పాఠకులని విశేషంగా అలరించిన ఈ రచయిత వ్యాసాలనే ప్రస్తుతం ఇలా పుస్తక రూపంలో మీ ముందుంచుతున్నాం. మనకు తేలిగ్గా లభించే, మనం రోజూ వాడుకునే పలు ద్రవ్యాలలో ఉన్న మనకు తెలియని ఎన్నో ఆహార ఔషధ విలువలని సరళమైన భాషలో చక్కగా వివరించారు రచయిత. ఇవే దినుసులతో ఆయుర్వేద, యునానీ వంటి సంప్రదాయ వైద్య విధానాలలో శతాబ్దాలుగా ప్రజలు ఉపయోగిస్తున్న పలు ఔషధ యోగాలను కూడా ఆయన విపులీకరించారు. సామాన్యులు చిన్నపాటి రుగ్మతలకు కూడా చీటికీ మాటికీ వైద్యుల వద్దకు వెళ్ళకుండా తమ ఇంటిలో లభించే ద్రవ్యాలతోనే తమ ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవచ్చో రచయిత జనరంజకంగా వివరించారు. ఈ పుస్తకం చదివిన ఎవరినైనా రచయిత లోతైన పరిశీలనా దృష్టి, లోకప్రియ శైలి ఇట్టే ఆకట్టుకుంటాయి. చక్కని నలుపు - తెలుపు, వర్ణచిత్రాలు ఈ పుస్తకంలోని ప్రత్యేక ఆకర్షణ. కొందరు విమర్శకులు అభిప్రాయపడినట్లు "ఇంటింటి వైద్యం" ఇంటింటా ఉండదగిన రిఫరెన్స్ పుస్తకం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అశేష పాఠకలోకం అభిమానాన్ని విశేషంగా చూరగొన్న ఈ రచయిత గతంలో చేసిన ఇదే తరహా రచనలు 'మన ప్రాచీనుల ఆహారం, ఆరోగ్యం, వైద్యం', 'కూరగాథలు' లాగే ఈ పుస్తకాన్ని కూడా అందరూ తప్పక ఆదరిస్తారని మా విశ్వాసం.

- ప్రచురణకర్తలు

గమనిక: "ఇంటింటి వైద్యం" ఈబుక్ సైజు 12.7 mb

Preview download free pdf of this Telugu book is available at Intinti Vaidyam